ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను ఇంటికి పరిమితం చేసేలా డీజీపీని ఆదేశిస్తూ ఎస్ ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మద్యే ఈ నెల 21వ తేదీ వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అయితే , తాజాగా తాజాగా మంత్రి పెద్దిరెడ్డి మీడియా తో మాట్లాడవద్దు అని ఎస్ ఈసి ఇచ్చిన ఆదేశాల్ని కూడా కోర్టు రద్దు చేసింది. అయితే , మీడియా తో మాట్లాడుతున్న సమయంలో ఇకపై ఎస్ ఈ సి ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయొద్దు అంటూ ఆదేశాలు జారీచేసింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు. అలాగే అదే సమయంలో జైలు శిక్షవేస్తామని బెదిరిస్తున్నారు. వాటితో పాటు.. తాజాగా ఉద్యోగుల్ని కూడా బెదిరించారు. ఎస్ ఈసీ మాటలు వింటే మార్చి 31 తర్వాత ఆ అధికారులని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ నేరపూరితమైన , ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలే కావడంతో ఎస్ ఈసీ ఈ నెల 21వ తేదీ వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే , దీనిపై ఆయన న్యాయపోరాటం చేసి రిలీఫ్ తెచ్చుకున్నారు.