జ‌గ‌న్ ఛాంబ‌ర్లో వ‌ర్ష‌పు నీటి వెనుకు కుట్ర‌??

Update: 2017-06-07 11:11 GMT
ఏపీ అసెంబ్లీలోని విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాంబ‌ర్లోకి నీళ్లు రావ‌టం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి అంత‌స్తులో ఉన్న జ‌గ‌న్ చాంబ‌ర్‌ కు నీళ్లురావ‌టం.. అదే స‌మ‌యంలో రెండో అంత‌స్తులో ఎలాంటి లీకు లేక‌పోవ‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇదిలా ఉంటే.. విప‌క్ష నేత గ‌దిలో లీకుపైన అక్క‌డ సిబ్బంది వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో.. ఈ వీడియో వైర‌ల్‌ గా మారింది. కొత్త‌గా క‌ట్టిన అసెంబ్లీ భ‌వ‌నంలో లీకు కావ‌టం ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎల్ అండ్ టీ.. ప‌ల్లోంజి లాంటి ప్ర‌ముఖ సంస్థ‌లు నిర్మించిన అసెంబ్లీ నిర్మాణం ఇంత నాసిర‌కంగా ఉందా? అన్న డౌట్లు ప‌లువురు వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో.. అంత భారీగా నీళ్లు ఎలా కారుతాయి?

లీకు ఉంటే అంతా ఉండాలే కానీ.. జ‌గ‌న్ ఛాంబ‌ర్లోనే ఉండ‌టం ఏమిటంటూ ప‌లువురు త‌మ‌కున్న సందేహాల్ని వినిపించారు. ఇదిలా ఉండ‌గా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న నీటి లీకు వీడియోపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  సీరియ‌స్ అయ్యారు. అస‌లు ఇదెలా సాధ్య‌మ‌న్న విష‌యాన్ని తేల్చాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాల నేప‌థ్యంలో నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధులు.. సీఆర్డీఏ అధికారుల‌తో క‌లిసి సీఐడీ ఎస్పీ కోటేశ్వ‌ర‌రావు అధ్వ‌ర్యంలో న‌లుగురు డీఎస్పీలు.. న‌లుగురు సీఐలతో పాటు ప‌లువురు రంగంలోకి దిగారు. లీకేజీపై లోతుగా ద‌ర్యాప్తు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అసెంబ్లీ భ‌వ‌నంలో ఏసీ వైర్లు..కేబుల్స్ వెళ్లేందుకు గోడ‌ల్లో నుంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారు. అయితే.. జ‌గ‌న్ పీఏ రూం పైన పీవీసీ పైపును ఎవ‌రో క‌ట్ చేసిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. భారీ వ‌ర్షానికి స్లాబ్ మీద‌కు నీరు చేర‌టం.. క‌ట్ చేసిన పైపు నుంచి నీరు లీకైన విషయాన్ని మీడియాను తీసుకెళ్లి మ‌రీ వివ‌రించారు. పైపును క‌ట్ చేయ‌టం వెనుక కుట్ర కోణం ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొద‌టి అంత‌స్తులోకి నీరు లీకు కాకుండా.. జ‌గ‌న్ ఛాంబ‌ర్లోకి నీరు రావ‌టం వెనుక కుట్ర కోణం ఉంద‌న్న నిర్ధార‌ణ‌కు సీఐడీ అధికారులు వ‌చ్చారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీ భ‌వ‌నాన్ని ప‌రిశీలించ‌టానికి వ‌చ్చిన స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ సైతం.. పైపు క‌ట్ చేసి ఉండ‌టాన్ని చూసి విస్తుపోయారు. ఎవ‌రు క‌ట్ చేసి ఉంటార‌న్న విష‌యాన్నితేల్చ‌టం కోసం సీఐడీ విచార‌ణ‌కు తాను ఆదేశించిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో సీసీ కెమేరాల ఫుటేజ్ ఉంటుంది కాబ‌ట్టి.. వాటిని కూడా ఫోరెన్సిక్ నిపుణుల ప‌రీక్ష‌కు పంపి.. త‌ప్పు చేసిన వారిని గుర్తిస్తామ‌న్న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. ఎవ‌రో కావాల‌నే పైప్ను క‌ట్ చేసిన‌ట్లుగా గుర్తించామ‌ని.. అలా క‌ట్ చేయ‌టం వ‌ల్లే ప్ర‌తిప‌క్ష నేత గ‌దిలోకి నీళ్లు వ‌చ్చిన విష‌యాన్ని గుర్తించామ‌న్నారు. దీన్ని చిలువ‌లు ప‌లువ‌లు చేసి లేనిది ఉన్న‌ట్లుగా చెప్పి.. ప్ర‌భుత్వ భ‌వ‌నాలు నాసిర‌క‌మ‌ని అంటున్నార‌న్నారు. ఎవ‌రి ప్ర‌మేయం లేకుండా ఏసీ పైపు ఏ రూపంలో క‌ట్ అవుతుంద‌న్న ప్ర‌శ్న‌ను స్పీక‌ర్ కోడెల సంధిస్తున్నారు. దీనికి బాధ్య‌త ఎవ‌ర‌న్న‌ది సీఐడీ విచార‌ణ‌లో తేలుతుంద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News