వీఆర్ఎస్ కే 'సోమేష్' నిర్ణయం? తెలంగాణ సలహాదారుగా వెళతారా?

Update: 2023-01-12 12:30 GMT
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మొత్తానికి ఏపీకి చేరుకున్నారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఆయన తక్షణమే ఆంధ్రా వెళ్లిపోవాలని కోర్టు తెలపడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయవాడ చేరుకున్నారు. సీఎస్ గా రిలీవ్ అయిన తరువాత ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంలోనే సలహాదారు పోస్టు ఇచ్చి సీఎం కేసీఆర్ ఆయనను పక్కనే పెట్టుకుంటారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా విజయవాడకు చేరి ఏపీ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆయన పోస్టు ఏంటీ..? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వీఆర్ఎస్ తీసుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ చేరుకున్న తరువాత సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు ఆయనను వీఆర్ఎస్ తీసుకుంటారా..? అని అడిగారు. అయితే ప్రస్తుతానికి వీఆర్ఎస్ తీసుకునే ఆలోచన లేదన్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంలో కొనసాగుతానని అన్నారు. అయితే సీఎం జగన్ తో భేటీ తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని సోమేశ్ చెప్పారు. దీంతో ఆయన ఏపీ సీఎంతో భేటీ తరువాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఏపీ సీఎం జగన్ సోమేశ్ కు ప్రధాన్య పోస్టు ఇస్తే ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ అప్రధానమైన వీఆర్ఎస్ తీసుకుంటారని అనుకుంటున్నారు. మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన ఆయనకు ఏపీలో అంతటి పోస్టు ఇచ్చే అవకాశం లేదనే తెలుస్తోంది. ఎందుకంటే సోమేశ్ కోసం ఇతరులనుపక్కన బెట్టే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. ఇప్పటికే ఉద్యోగులు సీఎం జగన్ పై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణలో మొన్నటి వరకు పనిచేసిన ఆయన కోసం ప్రాధాన్య పోస్టు నుంచి ఎవరినీ తప్పించే అవకాశం లేదు.

ఒకవేళ ప్రాధాన్య పోస్టు ఇచ్చినా తెలంగాణలో వస్తున్న విమర్శలే ఇక్కడా వస్తాయి. తెలంగాణలోని ప్రభుత్వం ఉద్యోగుల్లో చాలా మంది ఆయనపై రుసరుసలాడుతున్నారు. సోమేశ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తమకు తీవ్ర నష్టం చేకూర్చాయని అంటున్నారు.

ఉద్యోగుల విషయంలో 317 పాపం సమేశ్ దేనని కొందరు అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఆ బాధలను ఇప్పుడు ఏపీ ఉద్యోగులు పడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ తో ఉన్న మైత్రి బంధంతో సోమేశ్ కు ప్రాధాన్యం ఇస్తారని మరోవైపు చర్చ సాగుతోంది. ఆయనకు ఎలాంటి పోస్టు ఇచ్చినా వచ్చే డిసెంబర్ వరకే అన్న విషయం తెలిసిందే.

జగన్ తో మీటింగ్ తర్వాత సోమేష్ కుమార్ లో అంత ఉత్సాహం కనిపించలేదని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆయన మంచి పోస్టింగ్ వచ్చే అవకాశం లేదని తెలిసిందని.. అందుకే ఆయన వీఆర్ఎస్ తీసుకోవాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే మీడియాతో ఏ విషయం తేల్చకుండా వెళ్లిపోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఏఐఎస్ కు వీఆర్ఎస్ తీసుకొని అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ సూచనలతోనే సోమేష్ డిసైడ్ చేసుకోనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News