ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడ ఐలాపురం హోటల్ లో నిర్వహించిన అఖిలపక్ష భేటీకీ వైసీపీ, సీపీఎం మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ భేటీకి టీడీపీ వస్తున్నందున్న తాము వాళ్లతో కలిసి కూర్చోలేమని, విషయాలు డిస్కస్ చేయలేమని తేల్చిచెప్పింది. అయితే.. ఈ విషయాన్ని వారం రోజులే ముందు చెప్పేసింది వైసీపీ. దీంతో.. టీడీపీ వైసీపీ పార్టీ తీరుని దుయ్యబట్టింది. ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీ తరపు నుంచి మంత్రులు నక్కా ఆనంద్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు.
'ఏపీపై వైసీపీకి కానీ, జగన్ కు కానీ ఏమాత్రం చిత్తశుద్ది లేదు. ఉంటే పార్టీ తరపున ఎవో ఒకరు ఈ భేటీకి హాజరయ్యేవాళ్లు. ఒకవేళ భేటీకి వస్తే.. ఎక్కడ బీజేపీ ఏపీకి నిధులు ఇవ్వలేదనే నిజం ఒప్పుకోవాల్సిన వస్తుందనే ఉద్దేశంతోనే వైసీపీ డుమ్మా కొట్టింది. దీన్ని బట్టే అర్థం అవుతుంది.. వైసీపీ, బీజేపీ మధ్య సీక్రెట్ ఒప్పందం జరిగిందని. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారు, ప్రజల కోసం పోరాడాల్సిన ఇలాంటి అఖిలపక్ష భేటీలకు రారు. పోలీసు విచారణకు రారు' అంటూ వైసీపీని విమర్శించారు మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్ బాబు. ప్రత్యేక హోదా విషయంలోనే టీడీపీ పోరాడుతుందని, తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పోతామని ఈ సందర్బంగా మంత్రులు చెప్పారు. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ అఖిలపక్ష భేటీ నేపథ్యంలో వైసీపీని మరోసారి టార్గెట్ చేసింది టీడీపీ.