మంత్రి పదవి దక్కించుకున్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మంచి జోరు మీద ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అందరు నేతలతో భేటీ అవుతూ అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తల్లి కొణిదెల అంజనాదేవితో ఇటీవల ఆయన చర్చలు జరపడం నెల్లూరులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అంజనాదేవి కుమారులు చిరంజీవి, పవన్ లు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఎన్నడూ రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రచారం చేయడం కానీ లేదు. కానీ... సోమిరెడ్డి మాత్రం పనిగట్టుకుని ఆమెను ఎందుకు కలిశారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ముఖ్యంగా నెల్లూరులో పవన్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉండడం... గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన పవన్ ఈసారి ఏం చేస్తారన్నది అప్పుడే స్పష్టత రాకపోవడంతో సోమిరెడ్డి ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో పవన్ అభిమానుల్లో సానుకూలత పొందడం కోసం ఈ పని చేశారని అనుకుంటున్నారు. మంత్రి పదవి వచ్చాక మర్యాదపూర్వకంగా పవన్ తల్లిని కలవడం వల్ల పవన్ అభిమానుల్లో తన పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుందన్నది సోమిరెడ్డి అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే... పవన్ తో త్వరలో టీడీపీ నేతలు చర్చలు జరపబోతున్నారని.. అందుకు ప్లాట్ ఫాంగానే సోమిరెడ్డి పవన్ తల్లిని కలిశారని అంటున్నవారూ ఉన్నారు. దీంతో ఇదంతా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత అజెండాయా.. చంద్రబాబు ఎజెండాయా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/