రాజకీయాల్లో కష్టపడటం అనేది ఆయా వ్యక్తుల దగ్గర వారికి తప్ప వేరే వాళ్లకు తెలీదు. అంతగా అయితే ఆ నియోజకవర్గ ప్రజల వరకూ నేతల పనితీరులో ఉన్న కష్టం గురించి అర్థమవుతూ ఉంటుంది. అయితే కొందరు నేతలు పడే కష్టాన్ని చూసి జనాలకే జాలేస్తూ ఉంటుంది. వారి పట్ల నియోజకవర్గాలకు ఆవల ఉన్న జాలి వారు పోటీ చేసే నియోజకవర్గాల్లోని ప్రజలకు ఉంటే వారు నిక్షేపంగా చట్టసభలకు ఎన్నికవుతారు.
ఇలా నియోజకవర్గానికి ఆవల మంచి గుర్తింపును కలిగి ఉండి.. నియోజకవర్గ ప్రజల మన్నన పొందలేకపోతున్న నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ తరపున ఎక్కువగా మీడియాలో కనిపించే నేతల్లో సోమిరెడ్డి ఒకరు!
ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ స్పోక్‌పర్సన్స్‌లో సోమిరెడ్డిది ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియో. రెడ్డి క్యాస్ట్‌కు చెందినందున ఈయన మొదటగా కాంగ్రెస్‌లోని రెడ్లపై, ఆ తర్వాత వైఎస్సార్‌కాంగ్రెస్‌లోని రెడ్లపై తిట్టడానికన్నట్టుగా పెట్టుకొన్నట్టుగా ఉన్నారు.
రెడ్డిని రెడ్డి చేతే తిట్టిస్తే.. రాజకీయ విమర్శలు చేయిస్తే.. వాటికి మరింత క్రెడిబులిటీ వస్తుందనేది రాజకీయ నేతల లెక్క. అందుకే తెలుగుదేశంలో మొదట్లో వైఎస్‌పై ఆ తర్వాత జగన్‌పై విరుచుకుపడటానికి సోమిరెడ్డి వంటి వాళ్లు నియమితమయ్యారు. ఈ బాధ్యతల మేరకు అనునిత్యం మీడియా ముందుకు వచ్చి వైఎస్ ఫ్యామిలీపై విరుచుకుపడేవాడు సోమిరెడ్డి. అయితే ఆయనకు పార్టీలో తప్ప మరోరకమైన అధికారిక పదవిలేకపోయింది ఇన్ని రోజులూ. అయితే డీలా పడక సోమిరెడ్డి అలాగే తన తీరును కొనసాగించాడు. పలు మార్లు ఆశాభంగం కలిగినా వెనక్కు తగ్గలేదు.
ఆ కష్టానికే ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. తాజాగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అధికారిక ప్రకటనతో సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయమంది. మరి ఇది కష్టానికి తగిన ప్రతిఫలమే అనుకోవచ్చు!