తెలుగుదేశం పార్టీ అగ్ర నేత మాజీ మంత్రి - మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కోడెలకు, తన కొడుక్కి గొడవ జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా కోడెల మృతిపై పుకార్లు రేపుతోందని ఆయన విమర్శించారు. కోడెలతో తన కొడుక్కి ఎలాంటి గొడవా జరగలేదని ఆయన అన్నారు.
కోడెల ఉరి వేసుకుని ఆయన చనిపోయారని.. దీన్నిబట్టే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ప్రభుత్వ వేధింపులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని.. కోడెలపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని కోడెల అన్నారు. శవపరీక్ష కోసం ఆయన భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. కోడెలను ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు సోమిరెడ్డి తెలిపారు.
వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారని - ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూశారని సోమిరెడ్డి అన్నారు. ఫౌండర్ - ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఆస్పత్రిలోనే ఆయన చనిపోవడం బాధాకరమన్నారు. కోడెల కొడుకు శివరాం ప్రస్తుతం కెన్యాలో ఉన్నారని - మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకుంటారని సోమిరెడ్డి తెలిపారు.