మిత్రుడే అయినప్పటికీ మొహమాటం లేకుండా కడిగిపారేయటం ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అలవాటు. ఏపీ సర్కారు తీరుపై ఎప్పటికప్పుడు తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. ప్రభుత్వానికి మేలుకొలుపులా వ్యవహరిస్తుంటారాయన. తాజాగా ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యం దుకాణాలపై ఏపీలో మహిళలు పలువురు వ్యతిరేకిస్తున్న వైనాన్ని ప్రస్తావించిన సోము.. దేశ వ్యాప్తంగా మద్యపానాన్ని నిషేధించాలని మహాత్మాగాంధీ కోరిక అని.. గాంధీ కలలకు టీడీపీ సర్కారు తూట్లు పొడుస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి మద్యం.. బిర్యానీ సరఫరా అవుతున్నాయన్న ఆయన.. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు.ఎక్సైజ్ శాఖలో అంతులేని అవినీతి జరుగుతోందన్న ఆయన.. అవినీతిని అరికట్టటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ విరుచుకుపడ్డారు.
ఏపీ ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న అవినీతిపై సీఎంకు లేఖ రాసినట్లు చెప్పిన సోము వీర్రాజు.. మద్యంపై వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవటం దారుణమన్నారు. మద్యం.. పెట్రోల్ పై జీఎస్టీని కొన్ని దేశాలు మినహాయించారని.. అందుకే మనం కూడా మినహాయించాలన్న ఆయన.. రాజకీయ పార్టీల విరాళాల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
రూ.330 కోట్లతో మొక్కల్ని నాటారని.. మూడు రోజులకే అవి చనిపోయాయని మండిపడ్డ సోము.. ఏపీ రాష్ట్ర సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇక.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ పాదాలకు నమస్కారం చేయటంపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ.. రాజకీయం చేయటం ఏ మాత్రం సరికాదన్నారు. పెద్దవారికి పాదాభివందనం చేయటం సంస్కృతిలో భాగమన్న ఆయన.. ఏపీ అధికారపక్ష నేతల తీరును అన్ని కోణాల్లో తప్పు పట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.