టీడీపీని అట్లకాడ కాల్చి వాత‌లు పెట్టినట్లుగా

Update: 2018-02-06 07:29 GMT
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీని అట్లకాడ కాల్చి వాత‌లు పెట్టినట్లుగా మాట్లాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు పీఎం మోడీతో మంత‌నాలు జ‌రిపారు. ఆ మంత‌నాల్లో రాష్ట్రానికి కావాల్సిన నిధులుపై చ‌ర్చించారు. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయింపుపై లెక్క‌ప‌త్రాలు లేనందునే స్పంద‌న క‌రువైంది. దీంతో క‌క్క‌లేక మింగ‌లేక తొలిసారిగా మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ గురించి మాట‌తూలారు. భ‌విష్య‌త్తు గురించి సంకేతాలిస్తూ మిత్రధ‌ర్మం అంటే ఇదేనా..? ఇన్నిరోజులు భ‌రించింది చాలు. ఇక భ‌రించ‌లేం. మీపై మాట ప‌డ‌నీయ‌కుండా మ‌మ్మ‌ల్ని మేం కంట్రోల్ చేసుకున్నాం. అప్ప‌డే అయిపోయింద‌నుకోకండి. ఇప్పుడే మొద‌లైంది..ఇప్పుడే మొద‌లైంది. కాద‌ని మీరు ముందుకెళితే మీ ఇష్టం. మీకో దండం పెట్టి మా దారి మేము చూసుకుంటామంటూ కుండబద్దలు కొట్టారు.

అప్ప‌టి నుంచి బీజేపీ - టీడీపీ ల మ‌ధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా ఒక‌రిపై ఒక‌రు మాట‌ల‌తూటాల్ని పేల్చుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్ళ‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు.  ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పొత్తు గురించి మాట్లాడుతూ  ఏపీలో పీఎం మోడీ హ‌వాను చూసి త‌ట్టుకోలేక కుళ్లుకుంటున్నార‌ని సోము వీర్రాజు ఆరోపించారు.

ప్ర‌తీ చిన్న‌విష‌యానికి మ‌మ్మ‌ల్ని దెప్పిపొడుస్తున్నార‌ని..అయినా తాము మిత్ర ధ‌ర్మంతోనే వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని సూచించారు.

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింద‌ని పార్ల‌మెంట్ లో విమ‌ర్శ‌లు చేస్తూ బీజేపీని అల్ల‌రి పాలు చేయాల‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్ర‌శ్నిస్తున్న టీడీపీ నేత‌లు ...రాష్ట్ర బడ్జెట్ లో అన్ని జిల్లాలకు న్యాయం చేస్తున్నారా?...అని ప్ర‌శ్నించారు. 

అంతేకాదు తాను టీడీపీ గురించి నిజాలు చెబితే శ‌త్రువు - అవినీతి ప‌రుడిగా చూస్తోంద‌ని అన్నారు. రాజ‌కీయాల్లో కావాల్సింది 'కరప్షన్' కాదని 'కమిట్ మెంట్స్ అని చెప్పారు.  తాము అలా జీవిస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు
Tags:    

Similar News