బాబు అవినీతా..విచారించలేం బాబూ:సోమూ

Update: 2018-09-26 16:08 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై భారతీయ జనతా పార్టీ అసాధారణ స్థాయిలో విరుచుకుపడుతోంది. నాలుగేళ్ల మైత్రి బంధాన్ని కాదని చంద్రబాబు అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఇలాగే విరుచుకుపడుతోంది. కమలనాథులకు - తెలుగు తమ్ముళ్లకు మధ్య వైరం ప్రారంభమైనప్పటి నుంచి మాటల తూటాలు అటూ - ఇటూ పేలుతున్నాయి. తాజాగా బిజేపీ సీనియర్ నాయకుడు - ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు చంద్రబాబు నాయుడిపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసారు. చంద్రబాబు చేసిన అవినీతిపై విచారణ జరపాలంటే కోర్టులకు ఇప్పుడున్న సమయం సరిపోదని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలోనే కాదు అబద్దాలు చెప్పడంలో పేరు తెచ్చుకుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా కేంద్ర ప్రభుత్వ  అమ్రుత పథకం ఇచ్చిన నిధులతో కార్యక్రమాలు చేపట్టి, తానే ఈ పనులు చేసినట్లుగా అవార్డులు పొందారని విమర్శించారు. ఇదీ చంద్రబాబు నాయుడిలోని అవినీతి - అబద్దాలకు తార్కానమని అన్నారు.

ప్రక్రుతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు చంద్రబాబు నాయుడికి ఎలాంటి అర్హత లేదని - అసలు ఆ పద్దతిని ప్రవేశ పెట్టింది సుభాష్ పాలేకర్ అని సోమూ వీర్రాజు చెప్పారు. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం పాలేకర్ ను ఆహ్వానించకుండా చంద్రబాబును ఆహ్వానించారని అన్నారు. ప్రక్రుతి వ్యవసాయ రూపకర్త పాలేకర్ కంటే చంద్రబాబు నాయుడు పెద్దవారా..  అని సోమూ వీర్రాజు  ఎద్దేవా చేసారు. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ - ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్మమంత్రిగా ఉన్న ఈ సమయంలోనూ ప్రక్రుతి వనరులను దోచుకున్న - దోచుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రక్రుతి వ్యవసాయం పై మాట్లాడేందుకు  ఎలాంటి  అర్హతలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా భారతీయ జనతా పార్టీపై తెలుగుదేశం నాయకులు విరుచుకు పడుతున్నారు. దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ మాట్టాడుతూ బిజేపీ నాయకుల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ కు ఏ సాయం చేయకపోగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రక్రుతి వ్యవసాయ అంశం తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ ప్రక్రుతి వైపరీత్యంగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News