వైసీపీ అవినీతి పార్టీ అని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అంటున్నారు. ఏపీ లో అవినీతి మంత్రులు ఉన్నారని కూడా గర్జిస్తున్నారు. వారి మీద అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ బొత్తిగా నాలుగేళ్ల కాలం అలా కరిగిపోయింది. ఇప్పటిదాకా సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన ఏపీ బీజేపీ నేతలు ఇపుడే నిద్ర లేచినట్లుగా అవినీతి ఏపీలో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడమే విడ్డూరంగా ఉంది అంటున్నారు.
ఒక వైపు పవన్ కళ్యాణ్ జనసేన తరవున ఏపీ లో అవినీతి ఉందని చెప్పారు. ఆయన చాలా సార్లు వైసీపీ కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ పోరాటాలు చేశారు. నాడు మిత్రపక్షంగా ఉంటూ పెద్దగా రియాక్ట్ కానీ బీజేపీ పెద్దలు ఇపుడు మాత్రం బోర విడుచుకుని ముందుకు వచ్చి తామే వైసీపీ ని నిలదీస్తున్నామని చెప్పడమేంటి అంటున్నారు.
ఇక్కడ మరో మాట కూడా ఉంది. నాలుగేళ్ళుగా అవినీతి జరిగుతూంటే బీజేపీ ఏమి చేస్తోంది అన్నదే. టీడీపీ జనసేన విమర్శలు వరకే చేస్తాయి. వారికి ఎక్కడా పవర్ లేదు. కానీ కేంద్రంలో అధికారం లో ఉంటూ పవర్ ఫుల్ గవర్నమెంట్ గా పేరు తెచ్చుకున్న బీజేపీ కి ఏపీ లో స్కాములు నాలుగేళ్లుగా ఎందుకు కనిపించడలేదని ప్రశ్నిస్తున్నారు.
అవినీతి జరిగింది అంటూ మాటల తో టైం పాస్ చేయడం కాదు కదా నిజంగా జరిగింది అంటే కేంద్ర ఏజెన్సీల ను రంగం లోకి దింపి ఎవరేమి చేశారో లెక్కలు తేల్చాల్సిన బాధ్యత బీజేపీ మీద లేదా అని అడుగుతున్నారు. ఇక ఏపీ లో వైసీపీకి బీజేపీ ఎపుడూ అండగా లేదని సోము వీర్రాజు అంటున్నారు. కానీ ఒక తండ్రిగా మోడీ జగన్ని ఆదరిస్తున్నారని అదే పార్టీకి చెందిన కేంద్రం మంత్రులు ఏపీ కి వచ్చి పొగిడిన నాడు ఇదే బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పలేదని అంటున్నారు.
బీజేపీ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదని నాలుగేళ్ళ వైసీపీ పాలన పూర్తి అయిన తరువాత చెప్పడం కాదు, తొలి ఏడాదే ఆ ముక్క చెబితే సోము వీర్రాజు లాంటి వారి మాటల కు విలువ ఉండేదని అంటున్నారు. ఇపుడు ఏమన్నా ఏ రకమైన విమర్శలు చేసినా కూడా అవన్నీ ఎన్నికల వేడిలో కొట్టుకుని పోతాయన్న విషయం కమలం పార్టీ నేతల కు తెలియకపోవడమే చిత్రమని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తమ మిత్రుడని తమ తోనే ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకోవడం కాదు జనాలు నమ్మేలా యాక్షన్ ప్లాన్ ఒకటి ఉండాలిగా అన్న మాట కూడా వస్తోంది. దాని కంటే ముందు పవన్ రెండేళ్ళుగా అడుగుతున్నారు రోడ్ మ్యాప్ ఇవ్వమని, దాని విషయం అయినా తేల్చారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.
ఇక రైల్వే జోన్ సంగతేంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు ఇవన్నీ ఇపుడే వైసీపీ నేతల కు గుర్తుకు వచ్చాయా అని సోము వీర్రాజు అమాయకంగా అడుగుతున్నారు. కానీ మీకు నాలుగేళ్ళ తరువాత వైసీపీ అవినీతి గుర్తుకు వస్తే ఆటో మేటిక్ గా వైసీపీ నేతల కూ అవి గుర్తుకు రావా సోమూ సార్ అంటున్నారు.
ఏది ఏమైనా రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు. ఏపీ లో వైసీపీ బీజేపీల మధ్యన అదే జరుగుతోంది. అయితే తాము ఎన్నడూ జగన్ని సమర్ధించలేదని బీజేపీ ఈ రోజున ఒట్టేసి మాటలు చెబుతున్నా వాటిని జనాలు ఎంతవరకూ నమ్ముతారు అన్నది చూడాలి. రాజకీయాల్లో ఉంది ఒకరిని గురించి మరొకరు మాట్లాడానికే. సో బీజేపీ సోము వీర్రాజు మా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని జగన్ని కట్టడి చేసినా ఆ వైపు నుంచి రావాల్సిన విమర్శలు రాక మానవు కదా.
జగన్ మైండ్ గేమ్ ఇదంతా అని తాపీగా వీర్రాజు వాపోవడాన్ని కూడా అంతా తప్పు పడుతున్నారు. బీజేపీ అవసరాల కు కేంద్ర పెద్దలు వైసీపీ పెద్దల కు ఫోన్లు చేసిన సందర్భాలు మరచారా అని అడుగుతున్నారు. నాడు అలా జరిగిపోయింది. ఇపుడు వైసీపీ కి దూరం అని బీజేపీ అంటోంది. జనాల ను నమ్మించడానికి అష్టకష్టాలు పడుతోంది. కానీ జనాల కు ఎవరేంటో బాగా తెలుసు కదా అంటున్నారు.