ఏపీలో ఇప్పుడు హాట్ హాట్ రాజకీయం నడుస్తోంది. గడచిన నాలుగేళ్లుగా కలిసి మెలిసి సాగిన టీడీపీ - బీజేపీ... ఇప్పుడు వైరివర్గాలుగా మారిపోయాయి. మొన్నటిదాకా ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటే... ఇప్పుడు ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అంతేకాదండోయ్... నిత్యం టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ సర్కారును దుమ్మెత్తి పోస్తుంటే... ఏపీకి చెందిన బీజేపీ నేతలు బాబు సర్కారును ఓ ఆటాడుకుంటున్నారు. అంతేనా నేరుగా బాబునే నేరుగా టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను ప్రస్తావిస్తున్నారు. బాబు పాలన అంతా అవినీతిమయం అయిపోయిందంటూ ఆది నుంచి చెబుతూ వస్తున్న బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... ఎప్పటికప్పుడు బాబు బండారాన్ని బయటపెడుతూనే ఉన్నారు. టీడీపీ - బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడే... బాబు సర్కారు అవినీతిపై యుద్ధం మొదలెట్టిన వీర్రాజు... ఈ రెండు పార్టీలు వైరివర్గాలు మారిపోయిన తర్వాత తన మాటల తీవ్రతను మరింతగా పెంచేశారు.
ఈ క్రమంలో నేటి ఉదయం తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మీడియా ముందుకు వచ్చిన వీర్రాజు... నేరుగా బాబును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిని తవ్వాలంటే గునపాలు సరిపోవని, అందుకోసం ఏకంగా ప్రొక్లెయినర్లే కావాలంటూ తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. నిత్యం చంద్రబాబు జపం చేస్తున్న పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించిన వీర్రాజు... పోలవరం ప్రాజెక్టు ద్వారా అంచనాలకు అందనిరీతిలో అవినీతి బాగోతం జరుగుతోందని విరుచుకుపడ్డారు. *పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకోసారి లెక్కలు మారుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి అమాంతం రూ. 53 వేల కోట్లకు పెరిగింది. ఎందుకు?.. ఏ ప్రాజెక్టు అయినా చంద్రబాబుకు ఉపాధిహామీ పథకమే. ఆయన దోపిడీకి గునపాలు చాలవు. పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు కావాలి. దోపిడీలో చంద్రబాబుకు ఏకంగా ఆస్కార్ ఇవ్వొచ్చు* అంటూ నేరుగా బాబునే టార్గెట్ చేసిన వీర్రాజు... అవినీతి వ్యవహారాల్లో చంద్రబాబుకు ఏకంగా ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ తనదైన శైలి ఘాటు కామెంట్ చేశారు.
చంద్రబాబును అధర్మ చక్రవర్తిగా అభివర్ణించిన వీర్రాజు... అధర్మ చక్రవర్తి అయిన చంద్రబాబు అధర్మ పాలన చేయక ఇంకేం చేస్తారని మండిపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలను వీర్రాజు కాస్తా... అధర్మ పోరాటంగా తేల్చిపారేశారు. అయితే చంద్రబాబు అధర్మ పాలన 2019 దాకానేనని, 2019లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు అధర్మ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని ఆయన చెప్పారు. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయాన్ని కూడా ప్రస్తావించిన వీర్రాజు... తప్పంతా చంద్రబాబు సర్కారుదేనని, కేంద్రం ఇచ్చే ప్రతి ప్రాజెక్టును చంద్రబాబు... తనకు మాత్రమే ఉపాధి హామీ పథకంగా మార్చేసుకుంటున్నారని సెటైరిక్ విమర్శలు గుప్పించారు. మొత్తంగా చంద్రబాబు అవినీతిపై గతంలోనూ మాట్లాడిన వీర్రాజు... ఈ సారి మాత్రం కాస్తంత కొత్తగా చంద్రబాబు అవినీతిని తవ్వాలంటే ప్రొక్లెయినర్లు కావాలని, అవినీతిలో బాబుకు ఆస్కార్ ఇవ్వొచ్చని సరికొత్త కామెంట్లు చేశారు. మరి ఈ కామెంట్లపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.