ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి వచ్చిన లవ్ ప్రపోజల్ పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కస్సుమన్నారు. ప్రస్తుతానికి తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన మనసు పడటాన్నిఅస్సలు ఇష్టపడటం లేదు. పవన్ పార్టీపై తమకున్న ప్రేమను ప్రకటించిన బాబుపై విరుచుకుపడిన వీర్రాజు.. అదే పవన్ కల్యాణ్ పై ఏపీ అధికారపక్ష నేతలు విరుచుకుపడినప్పుడు.. ఆయన్ను టార్గెట్ చేసినప్పుడు ఇదే ఆవేశం.. ఇంతకు మించిన ఆగ్రహం ఏమైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కుప్పం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో టీడీపీ కార్యకర్త ఒకరు.. వచ్చేఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా? అని ప్రశ్నిస్తే.. అందుకు స్పందించిన చంద్రబాబు.. వన్ సైడ్ లవ్ ఉండకూడదని.. మనమెంతప్రేమించినా అవతలవారు ప్రేమించకుంటే ముందుకు వెళ్లదన్న రీతిలో రియాక్టు కావటం తెలిసింది. మరింత పక్కాగా.. చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటల్నియథాతధంగా చూస్తే.. ‘‘ఇద్దరు ప్రేమించుకుంటే అది పెళ్లి వరకు వెళుతుంది. వన్ సైడ్ లవ్ పనికి రాదు కదా. మనం జనసేనను ప్రేమిస్తున్నాం. జనసేన కూడా కలిసి రావాలి కదా’ అని వ్యాఖ్యనించారు.
ఈ వ్యాఖ్యలు సోము వీర్రాజుకు ఇరిటేట్ కలిగేలా చేశాయి. అందుకే.. ఆయన తనదైన శైలిలో చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘తన అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు. అవసరమైనప్పుడే లవ్ చేయటంలో ఆయన సమర్థుడు.. గతంలో కాంగ్రెస్ నుకూడా ఆయన లవ్ చేశారు. చంద్రబాబు అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో చెప్పను.. చంద్రబాబు పచ్చి అవకాశ వాది. ఏపీలో జనసేన.. బీజేపీలు మిత్రపక్షాలు’’ అంటూ రియాక్టు అయ్యారు.
జనసేనాని మీదా.. ఆయన పార్టీ మీదా ఇంతటి ప్రేమను ప్రదర్శించిన సోము.. జనసేన అధినేతపై ఏపీ మంత్రులు రియాక్టు అయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఇదే సోము ఏం చేశారు? తమ మిత్రపక్షంగా ఉన్న పవన్ ను ఎలా ప్రేమిస్తారన్నది సోమ సందేహమైతే.. మరి.. తమతో నడుస్తున్న వారి యోగక్షేమాలు.. మంచిచెడ్డలు చూడాలి కదా? అదేం చేయకుండా చంద్రబాబు మీద విరుచుకుపడటమా? అన్నది అసలు ప్రశ్న.