అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ మీద మచ్చగా మిగిలే ఈ ఉదంతం.. యూపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రికి నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై సదరు మంత్రి కొడుకు తన కారును ఎక్కించేశారన్న వాదన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మొత్తం ఎనిమిది మందిని బలి తీసుకున్నఈ ఉదంతంలో తన కుమారుడి పాత్ర లేదని సదరు కేంద్ర సహాయమంత్రి స్పష్టం చేస్తున్నారు. భిన్న వాదనలు వినిపిస్తున్న ఈ ఉదంతంలో అసలేం జరిగింది? రెండు పక్షాల వారు వినిపిస్తున్న వాదనలు ఏమిటి? అసలు ఇంతటి దారుణ పరిస్థితికి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
యూపీ (ఉత్తరప్రదేశ్)లోని తికునియాలో జరిగే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన ఎస్ యూవీ కారులో బయలుదేరారు.
ఇదిలా ఉంటే.. మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు చట్టాలపై నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రైతులు నల్లజెండాలతో నిరసన చేస్తున్నారు. దీంతో ఆశిష్ కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే.. ఆశిష్ తన కారును ఆపకుండా వేగంగా..ఇద్దరు రైతుల మీదకు కారును ఎక్కించేశారని చెబుతున్నారు. ఆ సమయంలో ఆశిష్ నే స్వయంగా కారు నడుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఇద్దరు రైతులు అక్కడికక్కడ మరణించారు. దీంతో.. అక్కడి రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వెంటనే వారు ఆశిష్ కారుతో సహా మూడు కార్లకు నిప్పు పెట్టినట్లుగా చెబుతున్నారు.
ఈ ఉదంతంలో మూడు కార్లు పూర్తిగా దగ్థం కావటమే కాదు.. ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకొని హింస కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు పోయిన పరిస్థితి. ఈ ఉదంతంలో పలువురు రైతులు.. జర్నలిస్టులు గాయపడ్డారు. మంత్రి కొడుకు కారుతో పాటు.. మరో రెండు కార్లు రైతుల మీదకు దూసుకెళ్లాయని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
అందులో మొదటిది..
హింసాత్మక ఘటనల్లో మరణించిన ఎనిమిది మంది రైతులే అని రైతు సంఘాలు ఆరోపణ
అందుకు భిన్నమైన వాదన ఏమంటే..
మరణించిన ఎనిమిది మందిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు ఉన్నట్లుగా అధికారుల మాట
విచిత్రమైన మరో అంశం ఏమంటే.. మంత్రి కొడుకు కారును ఊరికించటం కారణంగా ముగ్గురు చనిపోయినట్లుగా భారతీయ కిసాన్ యూనియన్ చెబుతుంటే.. కాదు నలుగురు చనిపోయినట్లుగా సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. తమ వారు చనిపోయిన విషయంలో ఈ రెండు సంఘాలు వేర్వేరుగా మాట్లాడటం గమనార్హం.
రైతులే దోషులా?
ఇదిలా ఉంటే.. ఈ మొత్తం దారుణానికి కారణం రైతులే అన్న వాదనను వినిపిస్తున్నారు. అదెలానంటే.. ఆశిష్ కాన్వాయ్ పైకి రైతులు రాళ్ల దాడి చేశారని.. ఆ సందర్భంలో కారును తలకిందులు చేశారని.. కారులోని డ్రైవర్ తో సహా ముగ్గురు బీజేపీ కార్యకర్తలను బయటకు లాగి మరీ కొట్టి చంపారని అధికారులు చెబుతున్నారు. ఈ వాదనలో లోపం ఏమంటే.. నిజంగానే అలా జరిగి ఉంటే.. కారులోని ఆశిష్ సంగతేమిటి? ఆయన్నుఉత్తనే వదిలిపెట్టరు కదా? కనీసం గాయాలు అయినా అయి ఉండాలి కదా? అన్న సందేహం కలుగుతుంది. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి మాత్రం తన కొడుకు లేనే లేడని స్పష్టం చేస్తున్నారు.
ఈ ఉదంతాలకు భిన్నమైన మరో వాదన కూడా వినిపిస్తున్నారు. మంత్రి కాన్వాయ్ పైన రైతులు రాళ్ల దాడికి పాల్పడ్డారని.. దీంతో కాన్వాయ్ లోని ఒక కారు తిరగబడిందని.. దాని కింద పడి ఇద్దరు రైతులు మరణించారని.. దీంతో పరిస్థితి మహా ఉద్రిక్తంగా మారి.. మొత్తం ఎనిమిది మంది మరణానికి కారణమైనట్లుగా చెబుతున్నారు. ఇలా భిన్నమైన వాదనలతో అసలేం జరిగిందన్న విషయంపై అమితమైన కన్ఫ్యూజన్ నెలకొంది.
రైతులపై వాహనాలు దూసుకెళ్లటం.. ఎనిమిది మంది మరణించటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనటమే కాదు.. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో స్పందించిన యోగి సర్కారు వెనువెంటనే చర్యలు చేపట్టింది. దీనికి ముందే.. ఈ దారుణ ఉదంతం గురించి తెలుసుకున్నంతనే రైతు నేతరాకేశ్.. కాంగ్రెస్ కీలక సభ్యురాలు ప్రియాంక వాద్రా.. మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ లు చేరుకొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షానే ఈ హత్యల్ని చేయించారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ ఘటన యూపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. పోలీసులు పెద్ద ఎత్తున పహరా కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా చోటుచేసుకున్న ఈ ఉదంతం ఎన్నికల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ ఉదంతం బీజేపీకి శాపంగా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.