కాస్త ఆలస్యంగా బయటకొచ్చిన ఒక ఉదంతం సంచలనంగా మారింది. ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమారుడు ఒకరు హైదరాబాద్ లోని శివారులో హల్ చల్ చేశారు. డమ్మీ గన్ పట్టుకొని తనకు మద్యం కావాలంటూ హల్ చల్ చేశారు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కుకట్ పల్లికి కాస్త దూరంలో ఉండే జగద్గరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ వద్ద ఉన్న మానస వైన్స్ షాపు వద్ద ఒక యువకుడు హడావుడి చేశారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత.. వైన్ షాపు వద్దకు వచ్చి.. కారు హారన్ అదే పనిగా కొట్టసాగాడు. షాపు మూసేసి వెళ్లిపోతున్న సిబ్బంది పట్టుకొని.. తనకు మద్యం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టాడు.
జేబులో నుంచి గన్ (తర్వాత అది డమ్మీ గన్ గా తేల్చారు) తీసుకొని.. తాను అడిగిన మద్యం బాటిళ్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో.. బెదిరిన సదరు షాపు సిబ్బంది.. అతడికి మద్యం బాటిళ్లను ఇచ్చారు. అనంతరం అతడి గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. విచారణకు దిగిన పోలీసులు.. సదరు యువకుడు హర్షారెడ్డిగా గుర్తించారు. ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమారుడిగా తేల్చారు. అయితే.. సదరు నేత స్థాయి ఏంటి? ఏ పార్టీకి చెందిన వారు? అన్న విషయంపై మాత్రం వివరాలు బయటకు రాలేదు.