మ‌ళ్లీ.. గంగారాం ఆసుప‌త్రిలో సోనియా!

Update: 2017-05-10 04:20 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం మ‌రోసారి దెబ్బతింది. ఇటీవ‌ల కాలంలో ఆమె త‌ర‌చూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఆ మ‌ధ్య‌న యూపీతో స‌హా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా యూపీలో త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ చేసిన రోజునే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టం.. అప్ప‌టిక‌ప్పుడు ఆమెను ఢిల్లీకి త‌ర‌లించ‌టం తెలిసిందే. ఆ త‌ర్వాత అస్వ‌స్థ‌త కొన‌సాగుతుండ‌టంతో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమె పాల్గొనలేదు.

అనంత‌రం ఆమె కోలుకున్న‌ప్ప‌టికీ.. ఈ మ‌ధ్య‌నే ఆమె మ‌రోసారి అనారోగ్యానికి గురైన‌ట్లుగా చెబుతారు. రెగ్యుల‌ర్ చెకప్ కోసం అమెరికాకు వెళ్లిన‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ.. అనారోగ్యం కార‌ణంగానే అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకొని వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అమెరికాలో జ‌రిగిన చికిత్స సంద‌ర్భంగా రాహుల్‌..ప్రియాంకా త‌దిత‌రులు అమెరికాకు వెళ్లి.. ఆమె వెంటే కొంత‌కాలం ఉండి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆమె కోలుకున్నారు.  తాజాగా మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టం గ‌మ‌నార్హం. ఆదివారం ఆమెకు ఫుడ్ పాయిజ‌నింగ్ తో అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమెను గంగారాం ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు.

గురువారం వ‌ర‌కూ ఆమె ఆసుప‌త్రిలో ఉండాల్సి వ‌స్తుంద‌ని వైద్యులు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన రెండు ద‌ఫాలుగా అమ్మ‌కు అనారోగ్యానికి గురైన ప్ర‌తిసారీ గంగారాం ఆసుప‌త్రిలోనే చికిత్స చేస్తున్నారు.  ఇదిలా ఉండ‌గా.. సోనియ‌మ్మ లాంటి వీవీఐపీ తీసుకునే ఆహారం ఫుడ్ పాయిజ‌నింగ్ కావ‌టం ఏమిటి? ఎక్క‌డ త‌ప్ప‌ట‌డుగులు ప‌డుతున్నాయి? ఇటీవ‌ల కాలంలో సోనియ‌మ్మ త‌ర‌చూ అనారోగ్యానికి కార‌ణం ఏమిటి? అన్న వివ‌రాలు వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ఉంది. కోట్లాదిమంది అభిమానించే సోనియా ఆరోగ్య ప‌రిస్థితిపై పూర్తి వివ‌రాలు తెలిపితే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News