టీడీపీ ఎంపీలు రాష్ట్రం కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకే సభలో గందరగోళం సృష్టిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే కాంగ్రెస్ - టీడీపీ పొత్తును ముందుగానే గ్రహించిన పీఎం మోడీ సభనుంచే పదునైన వ్యూహాలు రచయిస్తున్నారు.
గత కొద్దికాలంగా టీడీపీ -బీజేపీకి అసలు పొసగడంలేదు. ఇరువురు ఉప్పు- నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతున్నారు. కేంద్ర సాకారంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతున్న క్రెడిట్ అంతా టీడీపీకే దక్కుతుంది. ఇక రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏదైనా చేస్తుందా అంటే ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే అంశంపై కమలం పార్టీ నేతలు అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్లు . కేంద్రం నిధులు పంపిస్తే రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు. ఇదంతా మావల్లే జరుగుతుందని టీడీపీ అంటుంటే మేం ఏ సమాధానం చెప్పాలో అర్ధం కావడంలేదని , దానికి విరుగుడు ఉపాయాన్ని కనిపెట్టాలని సూచన ప్రాయంగా చెప్పారు. దీనిపై సుదీర్ఘ మంతనాలు జరిపిన కేంద్ర బీజేపీ నేతలు డిఫెన్స్ ఆడుతూ టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇదే విషయం గురించి సీఎం చంద్రబాబు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలు రాష్ట్రం తరుపున గట్టిగా వాదించుకోవాలని సూచించారు. అప్పటి నుంచి తెలుగుతమ్ముళ్లు రాష్ట్రంపై కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని , కేంద్రం నిధులు పంపించకనే కొన్ని పనులు స్థుప్తచేతనావస్థలో ఉన్నాయనే విషయాన్ని ఇరుపార్టీల నేతలకు తెలిసేలా ప్రయత్నిస్తున్నారు.
మొన్నటికి మొన్న బీజేపీ తీరును తప్పుబట్టిన చంద్రబాబు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఉండగా కేంద్రం నుంచి ఫోన్ రావడంతో సైలెంట్ అయ్యారు. కానీ ముందస్థు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు బీజేపీ ని దూరం పెట్టి కాంగ్రెస్ తో జతకట్టేలా ఆ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్.
అందుకు ఊతం ఇచ్చేలా ఇవాళ ఏపీ పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరాతీయడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై నిరసన చేస్తున్న టీడీపీకి చెందిన కేశినేని నాని - తోట నరసింహం - రామ్మోహన్ నాయుడులను పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రపరిస్థితుల్ని తెలుసుకున్న సోనియా ఆంధ్ర ప్రదేశ్ కు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారట.
దీనిపై కాంగ్రెస్ ఎత్తుల్ని చిత్తు చేసేలా మోడీ విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనంటూ తెరపైకి తెచ్చారు. నాడు సీఎం గా ఉన్న అంజయ్యను అవమానించారు కాబట్టే ఎన్టీఆర్ చలించిపోయి టీడీపీ ని స్థాపించారని గుర్తు చేశారు. దీంతో భవిష్యత్తులో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఇరుపార్టీల్ని తిరసర్కరిస్తారేమో అన్నట్లు కౌంటర్ ఇచ్చారు మోడీ.