తెరమీద ఎక్కువగా విలన్ పాత్రలు వేసే బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. నిజ జీవితంలో మాత్రం పెద్ద హీరో అయిపోయాడు. కరోనా ధాటికి అల్లాడుతున్న అభాగ్యులకు అతను చేసిన సాయం, సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్ డౌన్ వేళ రవాణా సౌకర్యాలు ఆగిపోయి, ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ దయనీయ స్థితిలో కనిపించిన వలస కార్మికులను ప్రభుత్వాలు కూడా పట్టించుకోని స్థితిలో సోనూ సూద్ ముందుకు వచ్చి సొంత ఖర్చుతో దాదాపు 20 వేల మందిని స్వస్థలాలకు పంపించాడు. అంతటితో ఆగకుండా తన సేవా దృక్పథాన్ని కొనసాగిస్తూ అనేక రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో తన ఇద్దరు కూతుళ్లను జోడెడ్లుగా మార్చి వ్యవసాయం చేస్తున్న పేద రైతు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని కొన్ని గంటల్లోనే ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొని ఇచ్చిన గొప్ప మనసు సోనూది.
ఈ రైతు కుటుంబం దీన స్థితిని తెలియజేసే వీడియోను సోనూ నేరుగా చూసి.. వాళ్లకు ట్రాక్టర్ కొనివ్వబోతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్న సంగతి స్పష్టం. సోనూ ట్విట్టర్ అకౌంట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ సోనూను కదిలించిన ఘనత తమదే అంటూ మన తెలుగు న్యూస్ ఛానెళ్లు క్రెడిట్ కోసం కొట్టేసుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. టీవీ 9, సాక్షి, ఎన్ టీవీ లాంటి ప్రధాన ఛానెళ్లు వేటికవే.. సోనూ తమ కథనాలు చూసే స్పందించాడని క్లైమ్ చేసుకుంటూ.. స్క్రోలింగ్స్ ఇచ్చేసుకున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఇదే విషయాన్ని ఊదరగొట్టేస్తున్నాయి.
సోనూ ఓ ట్వీట్ చూసి రెస్పాండయిన విషయం స్పష్టంగా తెలుస్తున్నపటికీ మన ఛానెళ్లు.. ఈ క్రెడిట్ తమదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరం. అసలు సాయం చేసిన వాడు ఏ హడావుడి లేకుండా సైలెంటుగా ఉన్నాడు. కానీ మన ఛానెళ్లు మాత్రం క్రెడిట్ కోసం కొట్టేసుకుంటున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. సోనూకు హడావుడిగా ఫోన్ చేయడం, ఆ కుటుంబం బాగోగులు చూసుకుంటామనడం గమనిస్తే ఇందులో తనకేమైనా క్రెడిట్ వస్తుందేమో అని చూస్తున్నట్లే ఉంది.