దేశంలో తొలిదశ కరోనా మహమ్మారి విజృంభించే సమయానికి సోనూసూద్ అందరు సినీ నటుల్లో ఒకరు. కానీ.. ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ రియల్ హీరో. నేషనల్ ఐకాన్. తన సేవా దృక్పథంతో ప్రజల మనసుల్లో నిజమైన హీరోగా స్థానం సంపాదించారు.
మొదటి వేవ్ లో ఎంతో మంది అభాగ్యులకు ఆపన్న హస్తం అందించిన సోనూ సూద్.. ఆ తర్వాత నుంచి చేతికి ఎముక లేదన్న చందంగా అడిగిన వారికల్లా సహాయం చేస్తూనే ఉన్నారు. సెకండ్ తారస్థాయికి చేరి, మారణహోమం సృష్టిస్తున్న వేళ కూడా తాను ఉన్నానంటూ అండగా నిలిచారు.
సుమారు నాలుగు వందల మందితో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ఎక్కడి నుంచి సహాయం కావాలని పిలుపు అందినా.. వెంటనే వాలిపోయాడు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్, మందులు ఒక్కటేమిటీ.. ఎలాంటి సహాయం అడిగినా.. కాదనకుండా, లేదనకుండా తన వంతుగా సహకారం అందిస్తూనే ఉన్నాడు.
కాగా.. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు సైతం ఓ వాగ్ధానం చేశాడు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలోనే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానని మాట ఇచ్చాడు. అయితే.. ఎప్పుడో ఇచ్చిన మాట కదా అని మరిచిపోలేదు. కరోనా తీవ్రత తగ్గింది కదా అని లైట్ తీసుకోలేదు.
నెల్లూరు జిల్లాలో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు సోనూ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సోనూ సూద్ స్వయంగా వెల్లడించారు. అది కూడా.. తెలుగులో ప్రకటించడం విశేషం. ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు సోనూ. ‘‘ఆక్సీజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ప్రాణ వాయువు త్వరలో ప్రారంభం కానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సీజన్ ప్లాంట్స్ ఇన్ స్టాల్ చేయబోతున్నాను’’ అని ట్వీట్ చేశారు సోనూ. ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.