కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్నా కూడా ప్రముఖ నటుడు సోనూ సూద్ తన నిస్వార్థ సేవను మరవలేదు. అవిశ్రాంతంగా పేదలు,అసహాయల కోసం పనిచేస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా సోకి ఊపిరితిత్తులు దెబ్బతింటున్న ఓ కరోనా రోగికి ప్రత్యేక చికిత్స కోసం ఏకంగా నాగపూర్ నుంచి హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ను సోనూసూద్ ఏర్పాటు చేయడం సంచలనమైంది.
కరోనా కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపు 85-90శాతం ఊపిరితిత్తులను కోల్పోయింది. సోనూ సూద్ ఆమె గురించి తెలుసుకొని నాగపూర్ లోని వోక్ హార్ట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో మాత్రమే చేస్తారని తెలిసి ఇక్కడి అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపారు.
అయితే దీనికి ప్రత్యేక చికిత్స ఇక్కడ అందుబాటులో ఇక్కడికి ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. ఈ చికిత్స కోసం హైదరాబాద్ నుంచి ఆరుగురు వైద్యులతో ఒకరోజు ముందుగానే రప్పించి వారి సమక్షంలో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ అపోలోకు తరలించారు.
హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో భారతికి ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకొని తిరిగి వస్తుందని సోనూ సూద్ చెప్పారు.కరోనా సమయంలో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొట్టమొదటి సారి. భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. ఆమె కోసం సోనూసూద్ చేసిన పనికి ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.