గతంలో ఎవరైనా కష్టంలో ఉంటే అధికారులకు చెప్పేవారు. దీంతో వారి సమస్యలకు పరిష్కారం లభించేదని భావించేవారు. తర్వాతి కాలంలో కొందరు రాజకీయ నేతలవరకు ఏమైనా సమస్యలు వెళితే ఫటాఫట్.. ధనా ధన్ అన్నట్లుగా ఇష్యూల్ని క్లోజ్ చేసేవారు. ఇక.. మంత్రి.. ముఖ్యమంత్రి స్థాయిలోని వారికి వ్యక్తిగత ఇబ్బందుల వెళితే.. వెంటనే వాటిని పరిష్కరించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది.
సినీ నటుడు సోనూసూద్ కే ఎవరైనా కష్టంలో ఉన్నారన్నా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలు.. వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ అపద్భాంధవుడిగా మారారు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమందికి వారి సొంతూర్లకు చేరేందుకు సాయం చేయటం.. అందుకు అవసరమైన వాహన సౌకర్యాన్ని కల్పించటం ద్వారా ఆయనలోని మరో కోణం అందరికి తెలిసింది. అది మొదలు.. ఎవరికి ఏదైనా కష్టంలో ఉన్నట్లు తెలిస్తే.. వెంటనే వారి సమస్యల్ని తీర్చటం మొదలు పెట్టారు. దీంతో.. ఎవరైనా వ్యక్తిగత ఇబ్బందులు.. సమస్యల్లో ఉంటే వారంతా సోనూసూద్ కు తమ గోడును వెళ్లబోసుకునే పరిస్థితి.
తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫోటోను ఆయన చూస్తే.. వెంటనే స్పందించటమే కాదు.. వారి కష్టాలకు చెల్లుచీటి ఖాయమంటున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏమిటంటే.. ఒక తండ్రి తన ఇద్దరు కొడుకులతో కలిసి పొలంలో పని చేయటం.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు.. కొడుకుల్నికాడెద్దులుగా మార్చి పని చేస్తున్న వైనం అందరిని కదిలిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దోరెపల్లి గ్రామానికి చెందిన శివగారి పెద్ద రాములుది వ్యవసాయ కుటుంబం. వారికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. అరవైఏళ్ల వయసులోనూ ఆ రైతు వ్యవసాయాన్ని ఆపకపోవటమే కాదు.. తన ఇద్దరు కొడుకులతో కలిసి పోలానికి వెళ్లి పని చేస్తుంటాడు.
వారి పొలంలో ఇప్పటివరకు పదిసార్లు బోర్లు వేయిస్తే.. అవన్నీ ఫెయిల్ అయ్యాయి. పదకొండోసారి సక్సెస్ అయ్యింది. పదిసార్లు బోర్లు వేసిన కారణంగా వారు అప్పులపాలయ్యారు. కూలీల్ని పిలిచేందుకు డబ్బులు లేకపోవటంతో.. వారే అన్ని పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయానికి అవసరమైన కాడెద్దులు లేకపోవటంతో ఇద్దరు కొడుకుల్ని చెరో కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేస్తున్నారు.
రాములు కష్టాల్ని చూసిన స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారులు..ప్రభుత్వం స్పందిస్తుందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. సోనూసూద్ చూస్తే మాత్రం వారి కష్టాలు ఇట్టే మాయమవుతాయన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. సోనూసూద్ కు ఈ ఫోటోలు వెళ్లే అవకాశం ఉందంటారా?