కాలమహిహ అని ఊరికే అనరేమో? టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎయిర్ అంబులెన్సు అవసరం కావటం ఏమిటి? ఆయన దాని కోసం ప్రయత్నాలు చేయటం ఏమిటి? ఒకప్పుడు ఆయన టీంలోని వారు ఇలా ఫోన్ చేస్తే.. అలా ప్రైవేటు చాపర్లు వాలిపోయేవి. అలాంటిది ఒక సీనియర్ నేత ఆరోగ్యం కోసం ఎయిర్ అంబులెన్సు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేయాల్సి రావటం.. అందుకు గంటల పాటు సమయం పట్టటం షాకింగ్ అనిపించక మానదు.
గత వారంలో ఒక మహిళకు అత్యవసర వైద్యం కోసం సినీ నటుడు కమ్ ఆపదలో ఉన్న వారు కోరినంతనే సీన్లోకి దిగే సోనూసోద్ ఒక ఎయిర్ అంబులెన్సు లో హైదరాబాద్ కు తీసుకెళ్లి.. అపోలోలో ఖరీదైన వైద్యం చేయించటం తెలిసిందే. తీవ్ర ఆరోగ్య సమస్యతో ఉన్న ఆ మహిళకు.. సర్జరీ చేయటం..ఇప్పుడామె ఆరోగ్యం బాగుండటం తెలిసిందే. సోనూసూద్ తలుచుకున్నంతనే వచ్చిన చాపర్.. చంద్రబాబు అంతటి వ్యక్తి ఎయిర్ అంబులెన్సు కోసం గంటల కొద్దీ ప్రయత్నాలు చేయటం కాల మహిమ కాక మరేంటి?
ఏపీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ సబ్బంహరి కరోనాకు గురి కావటం.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం తెలిసిందే. నాలుగు రోజుల నుంచి విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెబుతున్నారు. ఈ నెల 15న పాజిటివ్ రిపోర్టు రావటం.. అదే విషయాన్ని తానే స్వయంగా ప్రకటించిన సబ్బం హరి.. తాజాగా విషమ పరిస్థితుల్లో ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అమెరికాలోని వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సబ్బంను ఎయిర్ అంబులెన్సులో హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రయత్నాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. గంటల కొద్దీ సమయం గడుస్తున్నా.. ఎయిర్ అంబులెన్సు సిద్ధం కాకవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.