కోర్టు తీర్పుతో ఆమె ప‌ద‌వి ఊడిపోనుంది

Update: 2017-03-10 10:13 GMT
అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ద‌క్షిణ కొరియా అధ్య‌క్షురాలు పార్క్ గుయెన్‌ ను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌న్న కింది కోర్టు తీర్పును స‌మ‌ర్థించింది అక్క‌డి రాజ్యాంగ ధ‌ర్మాస‌నం. ఈ తీర్పుతో ఆమెపై క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్‌ కు తెర‌లేపిన‌ట్ల‌యింది. అదే జ‌రిగితే ప‌ద‌వీకాలం ముగియ‌క‌ముందే దిగిపోతున్న తొలి నేత‌గా పార్క్ నిలుస్తారు. 1980లో ద‌క్షిణ కొరియాలో ప్ర‌జాస్వామ్య పాల‌న ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జాస్వామికంగా ఎన్నికైన ఏ నేతా ప‌ద‌వీకాలం ముగియ‌క‌ముందే దిగిపోలేదు. ఈ క్ర‌మంలో తొలిసారిగా పార్క్ దిగిపోనుండ‌టంతో రెండు నెలల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించి మ‌రో నేత‌ను ఎన్నుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అయితే కోర్టు తీర్పు కంటే ముందే నిర్వ‌హించిన స‌ర్వేల్లో 70 నుంచి 80 శాతం మంది పార్క్‌ను తొల‌గించాల‌న్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు. 2012లో పార్క్ చేతిలో ఓడిపోయిన లిబ‌ర‌ల్ మూన్ జే ఇన్ ఒపినియ‌న్ స‌ర్వేల్లో ఆధిక్యంలో ఉన్నారు. నిజానికి ఇప్ప‌టికే రాజ‌కీయ అస్థిర‌త‌తో కుదేలైన ద‌క్షిణ కొరియాలో ఈ తీర్పు మ‌రింత హింస‌కు తావిస్తుంద‌న్న ఆందోళ‌న‌లు కూడా నెల‌కొన్నాయి. పార్క్ మ‌ద్ద‌తుదారులు, ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య గొడ‌వ‌లు చెల‌రేగే ప్ర‌మాదం క‌నిపిస్తున్న‌ది. అవినీతిలో కూరుకుపోయిన పార్క్ రాజీనామా చేయాలంటూ చాలా రోజులుగా నిర‌స‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. దీంతో గ‌తేడాది డిసెంబ‌ర్‌ లో ఆమెను తొల‌గించ‌డానికి పార్ల‌మెంట్‌ లో తీర్మానం చేశారు. అయితే రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఎలాంటి తీర్పును వెలువ‌రించినా దానిని అంగీక‌రించ‌బోమ‌ని ముందే ఇరు వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. పార్క్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గిస్తే హింస చెల‌రేగే ప్ర‌మాదం ఉంద‌ని గ‌త నెల‌లో ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. మ‌రోవైపు పార్క్‌ను తొల‌గించాల‌న్న నిర్ణ‌యాన్ని కోర్టు వ్య‌తిరేకిస్తే తాము నిర‌స‌న ర్యాలీలు చేప‌డ‌తామ‌ని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం కూడా హెచ్చ‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News