ఇటీవల కేంద్రప్రభుత్వం పబ్-జీ గేమ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ గేమ్‌ను ఇష్టపడేవారంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. అయితే పబ్జీ గేమ్‌ను రిలయెన్స్ సంస్థ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. దీంతో పబ్జీ గేమ్ మళ్లీ భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. పబ్జీ గేమ్‌ను దక్షిణకొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. ఇండియాలో ఈ కంపెనీపై నిషేధం విధించడంతో చైనా కంపెనీ నుంచి బ్లూ హోల్ స్టూడియోస్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకున్నది. ఈ క్రమంలోనే భారత్‌లో తిరిగి ప్రారంభంపై రిలయన్స్ జియోతో చర్చలు జరుపుతోంది.
ఇండియాలో ఈ గేమ్‌పై నిషేధించ విధించడంతో దక్షిణ కొరియాకు చెందిన ప్రధాన సంస్థ పబ్జీ కార్పొరేషన్.. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల భారత్ భద్రతా పరమైన కారణాల దృష్ట్యా పలు చైనా యాప్‌లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్జీని కూడా నిషేధించింది. ఈ క్రమంలోనే బ్లూ హోల్ స్టూడియోస్ నుంచి వచ్చిన బ్లాగ్‌లో.. భారతదేశంలో గేమ్ పంపిణీ కోసం రిలయన్స్ జియోతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పింది. డీల్ ఇప్పుడే ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ గేమ్ భారత్‌లోకి రానున్నట్టు సమాచారం. పబ్ జీకి బానిసలై ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయారు. దానిని ప్రభుత్వం నిషేధించగానే సంతోషించారు. ఆ మాయదారి మళ్లీ వచ్చేస్తుండటంతో తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.