దేశంలో మళ్లీ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుతంకరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు చేపట్టాయి. కొన్నిచోట్ల లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. అంతేకాదు మాస్కు తప్పనిసరి చేశాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్కు ధరించాల్సిందే. అలాగే భౌతికదూరం పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కానీ కరోనా మహమ్మారిని అదుపు చెయ్యడం సాధ్యమవుతుంది.
ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. అయితే ఈసారి కరోనా అత్యంత వేగంగా విస్తరించడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాఠించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ కఠిన నిబంధనలు అమలు అయ్యేలా చూస్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ కఠిన నిబంధనలు అమలు అవుతూనే ఉన్నాయి. రోడ్డు మీదకు వస్తే తప్పక మాస్క్ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాఠించాలని.. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. వీటిని తప్పక పాఠించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఏపీలోనూ ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, గంటూరు, విశాఖ జిల్లాల్లో పరిస్తితి ఘోరంగా ఉంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో 70 శాతానికి పైగా ఈ మూడు జిల్లాల్లోనే ఉండడం ఆందోళన పెంచుతోంది. దీంతో మూడు జిల్లాల్లోనూ అధికారులు కఠిన నిబంధనలపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా మాస్కు లేకుండా రావొద్దని హెచ్చరిస్తున్నా ప్రజలు వినడం లేదు. తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు అధికారులకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్ ఉండదు అని రుజువు చేస్తున్నాయి కొన్ని సంఘటనలు. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటూ పోలీసుకు ఫైన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుంటూరులో మాస్కు వేసుకోని ఒక సీఐకి ఫైన్ విధించారు జిల్లా ఎస్పీ. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారడంతో ప్రజల్లో భయం మొదలై , కరోనా నియమాలు తప్పక పాటిస్తారు అని అన్నారు. ఎందుకంటే పోలీసులకు ఫైన్ వేస్తే.. మన పరిస్థితి ఏంటని ప్రజలు భయపడే అవకాశం ఉంటుంది అంటున్నారు. మాస్కు ఎందుకు ధరించలేదని సీఐని ఎస్పీ ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవ్వడానికి వెళుతూ మర్చిపోయినట్లు సీఐ సమాధానమిచ్చారు. సీఐ సమాధానంతో ఎస్పీ సంతృప్తి చెందలేదు. కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి ఫైన్ విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాలని సూచించారు.