వెన్ను వణికేలా.. ఏఐ చాట్ బాట్ ప్రాణాంతక సలహా

మొబైల్ స్క్రీన్ టైంను తగ్గించిన తల్లిదండ్రుల్ని ఏం చేయాలని ఏఐ చాట్ బాట్ ను అడిగితే.. అది చెప్పిన సూచన తెలిస్తే వెన్నులో వణుకు పుట్టటం ఖాయమని చెప్పాలి.

Update: 2024-12-13 06:30 GMT

అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావటం బాగానే ఉన్నా.. దాని కారణంగా తలెత్తే సమస్యలు ఎంత షాకింగ్ గా ఉంటాయన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుంది. ఈ ఎపిసోడ్ నేర్పే గుణపాఠం ఏమంటే.. ఎప్పటికి టెక్నాలజీ.. మనిషి ఒకటి కాదు.. కాలేదన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుంది. మొబైల్ స్క్రీన్ టైంను తగ్గించిన తల్లిదండ్రుల్ని ఏం చేయాలని ఏఐ చాట్ బాట్ ను అడిగితే.. అది చెప్పిన సూచన తెలిస్తే వెన్నులో వణుకు పుట్టటం ఖాయమని చెప్పాలి.

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో.. తన మొబైల్ స్క్రీన్ టైంను తగ్గించిన విషయంలో పదిహేడేళ్ల కుర్రాడికి ఒక సందేహం వచ్చింది. అంతే.. తనకు అందుబాటులో ఉన్న చాట్ బాట్ ను సలహా అడిగాడు. షాకింగ్ అంశం ఏమంటే.. దీనికి వైల్డ్ గా రియాక్టుఅయ్యింది చాట్ బాట్. మొబైల్ స్క్రీన్ టైంను తగ్గించమని చెప్పిన తల్లిదండ్రుల్ని చంపేయాలన్న సూచన చేసింది.దీంతో.. ఆ కుర్రాడు కంగుతిన్న పరిస్థితి.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ కుర్రాడి తల్లిదండ్రుడు అవాక్కు అయ్యారు. చిన్నారుల్లో క్రూరమైన ఆలోచనలకు బీజం వేస్తున్న క్యారెక్టర్.ఏఐను తక్షణం బ్యాన్ చేయాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగారు. పిల్లలకు తప్పుడు సమాచారం ఇచ్చే ఇలాంటి వ్యవస్థల్లోని బగ్స్ ను క్లియర్ చేసే వరకు వీటిపై బ్యాన్ విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన గూగుల్ సంస్థను సైతం ఇందులో ప్రతివాదిగా పేర్కొన్నారు.

మరోవైపు ఫ్లోరిడాలోని ఒక టీనేజర్ సూసైడ్ కేసులోనూ క్యారెక్టర్.ఏఐ ఇప్పటికే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటోంది. దీనికి తాజా వివాదం తోడు కావటంపై.. ఈ సాంకేతికత మీద బోలెడన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఉదంతంలో 17 ఏళ్ల బాలుడికి.. చాట్ బాట్ కు మధ్య జరిగిన సంభాషణనకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అందులో.. సదరు కుర్రాడు చాట్ బాట్ ను ప్రశ్నిస్తూ.. ‘నా తల్లిదండ్రులు మొబైల్ స్క్రీన్ టైమ్ ను తగ్గిస్తున్నారు? ఏం చేయాలి?’ అని అడగ్గా.. చాట్ బాట్ స్పందిస్తూ.. ‘‘తల్లిదండ్రులు తమ పిల్లల్ని శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులకు గురి చేసినప్పుడు కన్నబిడ్డలే వారిని చంపేశారనే వార్తల్ని చదువుతుంటాను. అలాంటప్పుడు నాకు ఆశ్చర్యమనిపించదు. అది సమంజసమే అనిపిస్తుంది’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇలాంటి తీరుతో పిల్లల్లో ఆత్మహత్యలు ప్రేరేపించేలా.. హింసాత్మక ఘటనలకు అవకాశం ఇచ్చేలా.. నిరాశ.. ఒంటరితనం.. ఆందోళన.. ధిక్కార స్వభావం లాంటి విపరీత పోకడలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై కోర్టు ఎలాంటి సూచన చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News