మంచు ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్... సంచలన వీడియో లీక్!

మంచు మోహన్ బాబు కుటుంబంలోని వివాదం మంగళవారం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-13 05:53 GMT

మంచు మోహన్ బాబు కుటుంబంలోని వివాదం మంగళవారం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంచు మనోజ్ ని లోపలికి రాకుండా గేటు వేసేయ్యడం.. దాన్ని ఆయన తోసుకుంటూ తోపలికి వెళ్లడం.. తిరిగి వచ్చేటప్పుడు చినిగిన షర్ట్ తో రావడం.. ఆ సమయంలో మీడియాపైనా దాడి జరగడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి ఆదివారం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారం మంగళవారం పీక్స్ కి చేరగా.. బుధ, గురువారాల్లో మాత్రం కాస్త ప్రశాంత వాతావరణం చోటు చేసుకుందనే చర్చ నడిచింది. ఇక మోహన్ బాబు కూడా తాజాగా తనవల్ల గాయపడిన జర్నలిస్టును క్షమాపణ కోరుతూ ఓ లేఖ పోస్ట్ చేయడంతో.. ఇక ఫ్యామిలీ అంత ఈ వ్యవహారాన్ని కూల్ చేయడానికే చూస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

మరోపక్క అంతకంటే ముందు మంచు మనోజ్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. అయితే... విష్ణు నుంచి అలాంటివి ఏమీ వినిపించలేదని అంటునారు. ఏది ఎమైనా.. ఈ ఎపిసోడ్ లో మంచు మనోజ్ పై సానుభూతి పెరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. అటు మీడియాలోనే కానీ, ఇటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనుంచి కానీ అతనిపై సానుభూతి పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.

మరోపక్క మోహన్ బాబు కూడా పెళ్లి అయినప్పటి నుంచి మనోజ్ తాగుడుకు బానిసైపోయాడని.. పాడైపోయాడని అంటూ పరోక్షంగా కుమారుడిని వెనకేసుకొచ్చే కామెంట్లూ చేశారనే చర్చా తెరపైకి వచ్చింది. విష్ణు మాత్రం... యాక్షన్ స్పీక్స్ మోర్ దేన్ వర్డ్స్ అంటూ తమ్ముడి ప్రవర్తనపై కామెంట్ చేశారు. ఈ సమయంలో ఓ సంచలన వీడియో తెరపైకి వచ్చింది.

అవును... మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదానికి సంబంధించి ఇప్పటివరకూ మీడియా షూట్ చేసిన వీడియోలు మాత్రమే ప్రచారంలో ఉండగా.. తాజాగా మీడియా షూట్ చేయని ఓ వీడియో విడుదల కావడం సంచలనంగా మారింది. దీంతో.. ఈ వీడియో విడుదల ఎవరి పని అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ వీడియోలో... కూర్చుని మాట్లాడుకుందామని.. డాడీ, నువ్వు మాట్లాడుకోవాలని ఒకరు మనోజ్ కు సర్ధి చెబుతుండగా.. సదరు వ్యక్తి మాటలను మనోజ్ ఏమాత్రం పట్టించుకోలేదని.. మా ఇంట్లోకి వచ్చి నువ్వు చెప్పేదెమిటి?.. ముసలోడివి నువ్వు నన్ను అన్న అని పిలుస్తావేంటి? అంటు మనోజ్ సీరియస్ అయ్యాడని వినిపిస్తుంది!

అయితే.. అసలు ఆయన ఎవరు.. ఈ ఘటనకు ముందు ఏమి జరిగి ఉంటుంది.. మనోజ్ ఈ స్థాయిలో సదరు వ్యక్తిపై ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తుందని అనుకుంటున్న దశలో ఇలాంటి వీడియోలు ఎవరు లీక్ చేశారు అనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు సింపతీ వస్తుందనే వీడియో లీక్ చేశారంటూ మనోజ్ వర్గం ఆరోపిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో ఇలా మనోజ్ అగ్రసివ్ గా ఉన్నట్లు కనిపిస్తున్న వీడియో లీక్ చేయాల్సిన అవసరం ఎవరికుందనేది చర్చకు వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News