పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సీనియర్ రాజకీయవేత్త - ప్రస్తుత బీజేపీ నేత జయప్రదకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన జయప్రద ఇటీవలే బీజేపీలో చేరారు. ఆమెను బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. అక్కడ ఆమె ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ పై పోటీ చేయనున్నారు. అయితే, ఆమెపై ఉత్తర్ ప్రదేశ్ లోని ఎస్పీ నేత - సంభల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. తన కాలు గజ్జలతో - తుమ్కా డ్యాన్స్ తో రాంపూర్ ప్రజలను అలరించనున్నారన్నారు. ఈ కామెంట్ ఆగ్రహావేశాలు వ్యక్తమవడమే కాకుండా...కేసు నమోదు అయింది.
రాంపూర్ నుంచి 2సార్లు ఎంపీగా పనిచేసిన జయప్రద తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ బరిలో ఉన్నారు. ఆజంఖాన్ సన్నిహితుడు ఫిరోజ్ ఖాన్....తాజాగా జయప్రద పోటీని దృష్టిలో ఉంచుకొనే రానున్న ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం సాయంత్రాలు కలర్ ఫుల్ కానున్నాయంటూ వ్యాఖ్యానించడమే కాకుండా ఆమె తన డ్యాన్స్ తో అలరిస్తారని వ్యాఖ్యానించారు. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) లైంగికపర వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు సంబల్ జిల్లాలో ఫిరోజ్ పై కేసు నమోదు అయింది.
కేసుకు తోడుగా సమాజ్ వాధీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నుంచి కూడా ఫిరోజ్ ఖాన్ క్లాస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. స్త్రీలను గౌరవించాలని - పార్టీ నేతలకు ఆదేశించారు. ఓవైపు కేసు...మరోవైపు క్లాసు వచ్చిన నేపథ్యంలో ఖాన్ దారికి వచ్చారు. జయప్రద అంటే తాను కూడ అభిమానిస్తానని - వేరే ఉద్దేశంతో మాట్లాడలేదని అన్నారు. ఇదిలాఉండగా - ఎస్పీలోకి జయప్రదను తీసుకొచ్చింది ఆజంఖానే. 2004లో రాంపూర్ నుంచి ఆమెను గెలిపించారు. తర్వాత భేదాభిప్రాయాలు రావడంతో గతంలో ఆమెను డ్యాన్సర్ అని ఆజంఖాన్ సంభోదించారు. తాజాగా ఆయన అనుచరుడు ఫిరోజ్ మరింత వివాదాస్పద కామెంట్లు చేశారు.