తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ కుర్చీలో కూర్చోవాల్సిన మధుసూదనాచారి కూర్చోలేదు. ఆయన స్థానంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ కూర్చున్నారు. నిన్నటికి నిన్న సభా కార్యక్రమాల తీరు తెన్నుల గురించి నిర్వహించిన బీఏసీ సమావేశానికి సైతం స్పీకర్ హాజరు కాలేదు. ఎందుకిలా? అంటే ఆయన ఆరోగ్యం బాగోకపోవటం వల్లే ఆయన గైర్హాజరయ్యారు.
వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న మధుసూదనాచారి సభకు హాజరు కాలేకపోతున్నారు. ఇటీవల జ్వరం వచ్చిన ఆయన గడిచిన మూడు రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాకుంటే బాగా నీరసపడిపోయారని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెబుతున్నారు.
వైరల్ ఫీవర్ కావటంతో తీవ్ర నీరసానికి గురైన స్పీకర్ ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాత ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు నిమ్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య కారణాల వల్లే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి సభకు హాజరు కాలేకపోతున్నట్లుగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రకటించారు.