స్పెషల్ ఫండ్స్ సందడి: 10 వేల కోట్ల ఆశలు

Update: 2023-02-19 15:00 GMT
తెలంగాణలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షం హామీల వర్షం కురిపించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా గత బడ్జెట్ లో కేటాయించిన ప్రత్యేక నిధులు  రూ.10 వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించనున్నారు. అంటే ఏప్రిల్ నుంచి ఈ ఫండ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా నియోజకవర్గాలకు నిధులు బదిలీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది.

ఆయా సెగ్మెంట్లలో పెండింగులో ఉన్న పనులు, ఇతరత్రా వాటి కోసం సీఎం శ్రద్ధ వహించనున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వీక్ గా ఉన్న సెగ్మెంట్లకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తారని అంటున్నారు. ఇదే తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమపై పక్షపాతం వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు.

2024 జనవరిలో ఇప్పుడున్న ప్రభుత్వం గడువు పూర్తవుతుంది. ఈసీ అంతకంటే ముందే షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకటించాక కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో అభివృద్ది పనులు ఇక సాగవు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ముందస్తు అనుకుంటే ఎప్పుడైనా వెలువడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

గత బడ్జెట్ లో ప్రత్యేక నిధుల కింద రూ.10 వేల కోట్లు కేటాయంచిన విషయం తెలిసిందే. ఈ నిధుల ద్వారా  ప్రభుత్వం అభివృద్ది పనుల జోరు సాగించనుంది. ఇప్పటికే కొన్ని పనులకు గడువు మార్చి 31 విధించింది.

ప్రతీ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ ఇందులో భాగంగా ముందుగా అధికారంలో ఉన్న వాటిపై దృష్టి పెట్టింది. ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంటే వాటిని పట్టించుకోదని తెలుస్తోంది. కానీ వీక్ గా ఉండా పోటీ ఎక్కువగా ఉన్న వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక్కడి ప్రజలను ఆకర్షించుకునేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా పనులు చేసి వారి నుంచి ఇంప్రెస్ సాధించనున్నారు. అవసరమైతే కొన్ని నియోజకవర్గాలకు ఎక్కువ మొత్తంలో కేటాయించి ఆకర్షించనున్నారు.

రాష్ట్రంలో దాదాపు బీఆర్ఎస్ నియోజకవర్గాలే ఎక్కువ. దీంతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సెగ్మెంట్లపై సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన నియోజకవర్గానికి మౌలిక సదుపాయాల అవసరాల కోసం కూడా నిధులు కేటాయించడం లేదని కోర్ట మెట్లెక్కారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మాత్రం  స్పెషల్ ఫండ్స్ పై  ఆశలు పెరిగిపోయాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News