పంజాబ్ తమ రాష్ట్రంలో ఖైదీలకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. పంజాబ్ జైళ్లలోని ఖైదీలకు సంసార సుఖాన్ని కల్పించిన తొలి రాష్ట్రంగా పంజాబ్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో వారికి ఉచితంగా కండోమ్స్ కూడా అందిస్తోంది. నిబంధనలకు లోబడి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు గంటలపాటు ఖైదీలు తమ భార్యలతో సంసార సుఖాన్ని అనుభవించవచ్చు.
తొలుత గోయింద్వాల్ సాహిబ్‌లోని సెంట్రల్ జైలు, నాభాలోని కొత్త జిల్లా జైలు, భటిండాలోని మహిళా జైలులో దాంపత్య సుఖానికి అనుమతి ఉంటుందని జైళ్ల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే, కఠినమైన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లు, హై రిస్క్ ఖైదీలు, లైంగిక సంబంధిత నేరాలకు పాల్పడ్డ ఖైదీలకు ఈ సౌకర్యం ఉండదని ఆ అధికారి వివరించారు.
కేవలం మంచి ప్రవర్తన ఉన్నవారికి మాత్రమే దాంపత్య సుఖం సౌకర్యం అందుబాటులో ఉంటుందని పంజాబ్ జైళ్ల శాఖ చెబుతోంది. అలాగే జైళ్లలో ఎక్కువ కాలం గడిపిన ఖైదీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని వివరించింది. ప్రతి మూడు నెలలకోసారి ఖైదీలు రెండు గంటలపాటు తమ జీవిత భాగస్వాములతో గడపొచ్చు. ఇందుకు అటాచ్‌మెంట్ బాత్రూమ్‌తో కూడిన ప్రత్యేక గదిని కేటాయిస్తారు. ఉచితంగా కండోమ్స్‌ను సైతం అందిస్తారు.
ఈ నిర్ణయం వైవాహిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ఖైదీల మంచి ప్రవర్తనకు దారి తీస్తుందని డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తోంది.
కాగా జైలును సందర్శించే జీవిత భాగస్వామి వివాహ రుజువు చూపాల్సి ఉంటుంది. అలాగే తమకు ఎలాంటి లైంగిక వ్యాధులు, అంటు వ్యాధులు, కోవిడ్ లాంటివి లేవని వైద్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
కొద్ది రోజుల క్రితం, జైళ్ల శాఖ ఖైదీల కోసం వారి కుటుంబ సభ్యులను జైలు కాంప్లెక్స్‌లో కలిసే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
లూథియానా జైలు నుండి ప్రారంభించబడిన ఈ కార్యక్రమం కింద ఖైదీలు మరియు అండర్ ట్రయల్‌లు జైలు కాంప్లెక్స్ లోపల ప్రత్యేకంగా నియమించబడిన గదిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక గంట పాటు తమ ప్రియమైన వారిని వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు. ఇప్పుడు దాంపత్య సుఖాన్ని కూడా అందించడం ద్వారా ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా పంజాబ్ రికార్డు సృష్టించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.