రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి ఊహించని విచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఎవ్వరికి తెలియదు. కానీ ఆయన సోదరుడు నాగబాబు మాత్రం ఈ సారి జనసేన నుంచి పోటీ చేయబోతున్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కాకినాడ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీటుని నాగబాబుని పవన్ ఇచ్చేందుకు ముందుగానే కమిట్ అయ్యారని.. అందులో భాగంగానే..గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో నాగబాబు చెలరేగిపోతున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు అటు జనసేన కానీ ఇటు నాగబాబు కానీ ఎవ్వరూ ఈ విషయంపై స్పందించలేదు.
అసలు నాగబాబుపై వస్తోన్న వార్తల్ని ఒకసారి పరిశీలిస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబు ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు. తాను జనసేన కార్యకర్తగానే ఉంటానని.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని నాగబాబు గతంలోనే చెప్పారు. ఇక కాకినాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న చలమలశెట్టి సునీల్.. ఒకప్పుడు పీఆర్పీలో ఉండేవారు. సో.. పాత పరిచయాలు ఉంటాయి కానీ నాగబాబు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అవకాశమే లేదు. అన్నింటికి మించి రాజకీయాల్లో తనకు బంధుప్రీతి అంటే నచ్చదని పవన్ చెప్పాడు. అలాంటి పవన్ అన్నయ్య కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టేస్తాడని అనుకోలేం. ఇక ఫైనల్ గా.. ఈ మధ్యనే నాగబాబు - వరుణ్ ఇద్దరూ కలిసి జనసేనకు రూ.1.5 కోట్లు పార్టీ విరాళం ఇచ్చారు. ఇప్పుడు కనుక పోటీ చేస్తే.. ఆ డబ్బులు ఇచ్చింది ఇందుకోసమే అనే అపవాదుని నాగబాబు మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో.. ఎలా చూసినా కాకినాడ నుంచి కాదుకదా.. ఎక్కడనుంచైనా నాగబాబు పోటీలో ఉండే అవకాశమే లేదు.