టీడీపీ తరఫు నుంచి నంద్యాల ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎస్పీవై రెడ్డి ఇప్పుడు ఆయనతో కొత్త బేరాన్ని మొదలుపెట్టారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అదే నంద్యాల ఎమ్మెల్యే టికెట్! దాన్ని తన కూతురుకు కేటాయించాలని ఎస్పీవై రెడ్డి చంద్రబాబును కోరారని తెలుస్తోంది. తన కూతురు కోసం నంద్యాల ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చంద్రబాబుకు విన్నవించినట్టుగా ఎస్పీవై రెడ్డి ప్రకటించారు.
ఈ విషయంలో మరోసారి తను చంద్రబాబును కలవబోతున్నట్టుగా కూడా ఆయన వివరించారు. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా నంద్యాల ఎంపీ టికెట్ కోరారు. దాన్ని కేటాయించాలని చంద్రబాబును కలిశారు. అయితే ఆ సమయంలో బయటకు వచ్చాకా ఎస్పీవై సంచలన ప్రకటన చేశారు. నంద్యాల ఎంపీ టికెట్ అడిగితే.. ‘ఖర్చుకు అరవై కోట్ల రూపాయల డబ్బులున్నాయా?’ అని చంద్రబాబు నాయుడు తనను కోరినట్టుగా ఎస్పీవై ప్రకటించారు!
తను బాబును నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి వస్తే.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం బాబు డబ్బులు అడుగుతున్నట్టుగా ఎస్పీవై ప్రకటించారు. తదుపరి ఏం చేయాలనే అంశం విషయంలో అనుచవర్గంతో సమావేశం కూడా నిర్వహించారాయన. ఆ సమయంలో ఆయన టీడీపీని వీడవచ్చనే రూమర్లు కూడా వినిపించాయి.
అయితే అనుచరులతో సమావేశంలో అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. బాబు మీద నమ్మకం ఉందని.. తమకు న్యాయం జరుగుతుందని ఎస్పీవై రెడ్డి అల్లుడు కూడా ప్రకటించుకున్నారు. తనకు నంద్యాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో బాబు భరోసా ఇచ్చినట్టుగా పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ అదే టికెట్ విషయంలో ఎస్పీవై వెళ్లి చంద్రబాబును కలిసినట్టుగా తెలిపారు. మొత్తానికి టికెట్ విషయంలో ఎస్పీవై ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారని స్పష్టం అవుతోంది. మరి ఈ ప్రయత్నాలకు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!