శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (SAS Group) సంచలన సర్వె : శ్రీకాకుళంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు...?

Update: 2023-03-06 17:49 GMT
ఏపీలో సెంటిమెంట్ జిల్లాగా పేరున్న శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఎన్నికల్లో వస్తాయన్నది శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్  (ఎస్ ఏ. ఎస్ గ్రూప్ ) సంచలన సర్వే ద్వారా వెల్లడైంది. ఈ సర్వే సంచలనం రేకెత్తిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో గతసారి అంటే 2019లో చూసుకుంటే  వైసీపీ మొత్తం ఎనిమిది చోట్ల గెలిచి విజయ ఢంకా మోగించింది.

అయితే ఈసారి పరిస్థితి అలా ఉంటుందా అంటే లేనే లేదు అని శ్రీ ఆత్మ సాక్షి గ్రూపు  (ఎస్ ఏ. ఎస్ గ్రూప్ ) స్పష్టం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లకు గానూ టీడీపీకి ఆరు సీట్లు కచ్చితంగా వస్తాయని సర్వే పేర్కొంది. వైసీపీకి కచ్చితంగా వచ్చేవి రెండు మాత్రమే ఉన్నాయి. మరో రెండు సీట్లు హోరా హోరీ పోరుగా సర్వే పేర్కొంది.

ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే తెలుగుదేశానికే ఇచ్చాపురం, ఎచ్చెర్ల, పాతపట్నం, రాజాం, పలాస, ఆముదాలవలస సీట్లు దక్కుతాయని సర్వే వెల్లడించింది. ఇక వైసీపీకి పాలకొండ, నరసన్నపేట సీట్లు దక్కుతాయని తెలియచేసింది. హోరా హోరీ పోరులో ఉన్న సీట్లుగా శ్రీకాకుళం, టెక్కలి ఉన్నాయి. ఈ రెండు సీట్లలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు.

మరో వైపు చూస్తే పలాస లో మంత్రి సీదరి అప్పలరాజు ఓటమిని ఈ సర్వే ఖాయం చేసింది. అదే విధంగా పాతపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆముదాలవలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎచ్చెర్ల  నుంచి  గొర్లె కిరణ్ కుమార్,  రాజాం  నుంచి కబాల జోగులు ఓడిపోతారని సర్వే చెబుతోంది. అదే విధంగా చూస్తే తెలుగుదేశానికి శ్రీకాకుళం కంచుకోట అని మరోసారి రుజువు చేసేలాగానే 2024 ఫలితాలు ఉండబోతున్నాయని ఈ సర్వే చెప్పింది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News