శ్రీలంక సంచలన నిర్ణయం..

Update: 2019-04-29 06:30 GMT
మతన్మోదశక్తుల మానవబాంబుల దాడిలో సర్వం కోల్పోయిన శ్రీలంక ప్రభుత్వం దేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఈస్టర్ రోజున బాంబు పేలుళ్లలో 321మంది చనిపోయి సుమారు 500 మంది గాయపడ్డారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం కఠిన చట్టాలను చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది.

శ్రీలంక వ్యాప్తంగా ఏప్రిల్ 29 సోమవారం నుంచి ఎవరూ బుర్ఖా ధరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో చట్టవిరుద్ధ చర్యలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. సైనిక బలగాలకు తనిఖీల్లో ఇబ్బందులు లేకుండా.. నిందితులను గుర్తించేందుకే బుర్ఖాపై నిషేధం విధించామని ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

బుర్ఖా నిషేధంపై శ్రీలంక అధ్యక్ష కార్యాలయం వివరణ ఇచ్చింది. దేశంలో ఇప్పటికే చాలా మంది ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడం లేదని.. ఈ నిర్ణయాన్ని ముస్లిం నేతలు కూడా అంగీకరించారని తెలిపింది. 1990 లో జరిగిన గల్ఫ్ యుద్ధం వరకూ కూడా శ్రీలంకలో బుర్ఖా ధరించడం సంప్రదాయం కాదని..యుద్ధం అనంతరం మొదలైన ఈ ప్రక్రియను నేటితో దేశంలో పూర్తిగా తొలగిస్తున్నామని స్పష్టం చేసింది.
    

Tags:    

Similar News