యార్కర్ కింగ్ ఇక సెలవు.. రిటైర్ మెంట్

Update: 2021-09-14 16:01 GMT
శ్రీలంక  స్టార్ ఫాస్ట్ బౌలర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మలింగ ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్ మెంట్ ఇవ్వగా.. తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని లసిత్ మలింగ స్పష్టం చేశారు. తాను క్రికెట్ ఆడకున్నా ఆటపై ప్రేమ అలాగే ఉంటుందని లసిత్ మలింగ వెల్లడించారు.

మలింగ 2020లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ను 6 మార్చి 2020న వెస్డిండీస్ తో ఆడాడు. మలింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు.  ఈ లీగ్ లో అత్యంత విజయవంతమైన బౌలర్ గా మలింగ నిలిచాడు.

ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మలింగదే. మొత్తం 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 13 పరుగులకే ఐదు వికెట్లు. ఈ ఏడాది యూఏఈ, ఒమన్ లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టులో మలింగకు చోటు దక్కలేదు. శ్రీలంక సెలెక్టర్లు దాసున్ శనకను జట్టు కెప్టెన్ గా నియమించారు.

లసిత్ మలింగ తన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏకంగా 30 టెస్టులు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్  తరుఫున 122 మ్యాచ్ లు ఆడాడు.ఇప్పటివరకు 500 పైగా వికెట్లు తీశాడు.
Tags:    

Similar News