శ్రీచైతన్య, నారాయణ.. మోసం.. ఐఐటీ టాపర్ తమవాడేనంటూ.. దొంగ ప్రచారం!
విద్యారంగంలో ఉన్నతస్థాయి కార్పొరేట్ సంస్థలు చేస్తున్న మోసాలకు ఇది పరాకాష్ఠ. ఇప్పటి వరకు చదువుల పేరుతో భారీ ఎత్తున దోచుకోవడమే తెలిసిన విద్యాసంస్థలు.. ఇప్పుడు తమకు సంబంధమేలేని.. ర్యాంకులను.. తమ సంస్థ సాధించని రాంకులనుకూడా తమవిగా చెబుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల విద్యా ర్థులను వారి తల్లిదండ్రులను కూడా నిలువునా.. మోసం చేసిన ఉదంతం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లింది. ఇటీవల విడుదలైన.. ఐఐటీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థిని తమవాడంటే తమ వాడని ప్రచారం చేసుకున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి.
చదువు పేరుతో దోపిడీనే పరమావధిగా ముందుకు సాగుతున్నాయంటూ.. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇప్పటికే బ్యాడ్ నేమ్ ఉంది. దీనికి తోడు.. ఇప్పుడు మరింతగా ఈ సంస్థలు దిగజారిపోయాయి. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన.. ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. వీటిలో ఫస్ట్ ర్యాంకు.. రాజస్థాన్‌కు చెందిన మృదుల్ అగర్వాల్ అనే విద్యార్థి సంపాయించుకున్నాడు. ఈయన అలెన్ సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. అయితే.. ఏపీ, తెలంగాణలో మాత్రం.. శ్రీచైతన్య, నారాయణ సంస్థలు.. ఇతను తమ విద్యార్థేనని.. అతను ఫస్ట్ ర్యాంక్ సాధించడం తమ ఘనకార్యమేనని పెద్ద ఎత్తున ఫస్ట్ పేజీ యాడ్లు ఇచ్చి.. ప్రచారం చేసుకున్నాయి.
శ్రీచైతన్య ఇచ్చిన యాడ్‌లో మృదుల్ అగర్వాల్.. ఈ సంస్థ ఇచ్చిన కోటు వేసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. అతని పేరు కింద మాత్రం చిన్నగా కనిపించీ కనిపించకుండా ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాశారు. ఇక, నారాయణ సంస్థ ఇచ్చిన ప్రకటనలో ఒకచోట శ్రీచైతన్య రాసినట్టు కనీసం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ వంటి పదాలు కూడా రాయలేదు. మరోచోట మాత్రం కనిపించీ కనిపించకుండా ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాశారు. నేరుగా తమ దగ్గరే చదువుకున్న విద్యార్థి అనే అర్థం వచ్చేలా నారాయణ ప్రకటన కనిపిస్తుంది. ఇక, ఇదే బాటలో ఫిట్ జీ సంస్థ కూడా నడిచింది. ఈ సంస్థ అయితే మృదుల్ తమ సంస్థలో చదివినందుకు కృతజ్ఞతగా రాసిన లేఖను ప్రచురిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆ లేఖలో మృదుల్ చేతిరాత, సంతకం కూడా ప్రచురించారు.
అయితే.. నిజానికి మృదుల్ ఈ మూడు సంస్థల్లో ఎక్కడా చదవలేదు. కానీ.. వచ్చిన క్రెడిట్ ను మాత్రం వీరు కొనుగోలు చేశారనే వాదన ఉంది. తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చూస్తే ఈ ఏడాది ఐఐటి ప్రవేశ పరీక్షలో టాపర్ కనీసం నాలుగు కాలేజీల్లో చదివినట్టు అర్థమవుతుంది. ఒక విద్యార్థి అన్ని కాలేజీల్లో ఎలా చదువుతాడు? నిజంగా అతను నాలుగు కాలేజీల్లో చదివాడా? లేక ప్రతీ కాలేజీ టాపర్ తమవాడేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయా? తన ర్యాంకు వచ్చినప్పుడు మృదుల్ అగర్వాల్ ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టారు. అందులో తనకు నాలుగేళ్ల పాటూ చదువు పరంగానూ, ఇతరంగానూ మద్దతునిచ్చిన అలెన్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు.
సో.. దీనిని బట్టి అతను చదివింది అలెన్ సంస్థలో. ఇదే విషయాన్ని ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా తెలిపారు. అయితే.. మరి అగర్వాల్‌ను రెండు తెలుగు విద్యాసంస్థలు ఎందుకు సొంతం చేసుకునే ప్రయత్నం చేశాయి? తమకు దక్కని విజయాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవడం అంటే.. ఖచ్చితంగా ఏపీ, తెలంగాణలోనివిద్యార్థులను, వారితల్లిదండ్రులను మోసం చేయడం కాదా? ఇదే విషయంపై ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. విద్యార్థి సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అదేసమయంలో తెలంగాణ విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లాయి. మొత్తంగా చూస్తే.. కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడీ పరంపరలో ఇదీ ఒక భాగమే.. అనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.