శ్రీదేవి కేసు ముగిసింది : దుబాయ్ ప్రాసిక్యూషన్

Update: 2018-02-27 12:32 GMT
ఎట్ట‌కేల‌కు అతిలోక సుంద‌రి మ‌ర‌ణంపై మిస్ట‌రీ వీడింది . శ్రీదేవి బాత్ ట‌బ్ లో ప‌డిపోయిందని దుబాయ్ ఫారెన్సిక్ రిపోర్టును ప్రాసిక్యూష‌న్ ఏకీభ‌వించింది. శ్రీదేవి బాత్ ట‌బ్ లో ప‌డిపోవ‌డం వ‌ల్లే చ‌నిపోయింద‌ని తేల్చిచెప్పింది. దీంతో శ్రీదేవి మ‌ర‌ణంలో బోనీక‌పూర్ కు క్లీన్ ఇచ్చేసింది.   అనంతరం శ్రీదేవి డెడ్ బాడీకి ఎంబామింగ్ చేయాలంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ ఎంబామింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా శ్రీదేవి డెడ్ బాడీని సాధార‌ణ స్థితికి వ‌చ్చేలా కొన్ని ప్లూయిడ్స్ ను శ‌రీరంలోకి ఎక్కిస్తారు. అయితే ప్ర‌స్తుతం డెడ్ బాడీకి ఎంబామింగ్ పూర్తి అయిపోయిన‌ట్లు తెలుస్తోంది. శ్రీదేవి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న ఆమె కుటుంబ‌స‌భ్యులు ముంబైకి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మ‌రికొద్ది సేప‌ట్లో శ్రీదేవి డెడ్ బాడీని దుబాయ్ కార్గో ఎమిరేట్స్ ఎయిర్ పోర్టు టెర్మిన‌ల్ 3నుంచి ముంబైకి త‌ర‌లిస్తారు. అక్క‌డి నుంచి ముంబైకి రావ‌డానికి 10గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

10గంట‌ల నుంచి శ్రీదేవికి ఎంతో ఇష్ట‌మైన భాగ్య బంగ్లాలో కడసారి చూసేందుకు తరలి వచ్చిన ప్రముఖులు, అశేష అభిమానులకోసం  ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నారు.  అనంత‌రం రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీదేవి మ‌ర‌ణంపై భార‌త్ మీడియా చూపిస్తున్న అత్యాత్సాహంపై దుబాయ్ మీడియా ఆశ్చ‌ర్య‌పోయేలా క‌థ‌నాల్ని ప్రసారం చేయ‌డం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News