క్రికెట్ లో పేరున్న దిగ్గజాలు సచిన్, సునీల్ గవస్కర్, సువర్ట్ బిన్నీ లాంటి వారు తమ సంతానాలను కూడా తమలాగా తయారు చేయలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్ లో మెరిపించలేకపోయారు. బాగా ఆడిన క్రికెటర్ల కొడుకులు రాణించడం లేదు. అందుకే కూతుళ్లకు శిక్షణ నిస్తూ రాటుదేలుస్తున్నాడు శ్రీలంక విలక్షణ క్రికెటర్ లసిత్ మలింగ.
లసిత్ మలింగ తన కుమార్తెకు శిక్షణ ఇస్తూ కనిపించాడు
శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ ఇటీవల మెల్‌బోర్న్‌లోని క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్‌లో తన కుమార్తె ఏకీషా సేపరామడుతో సమయాన్ని గడిపాడు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇందులో అతను తన కూతురికి బ్యాటింగ్‌లో మెళకువలు నేర్పిస్తూ కనిపించాడు. నువాన్ కులశేఖర , ప్రభాత్ నిస్సాంకతో పాటు, మలింగ మెల్బోర్న్లో మెల్బోర్న్ క్రికెట్ కోచింగ్ నిర్వహించిన "ది ట్రిపుల్ ఎఫెక్ట్" అనే బౌలింగ్ వర్క్‌షాప్‌లో భాగంగా అక్కడికి వెళ్లాడు. ఆస్ట్రేలియాలోని వివిధ వయసుల యూత్ ప్లేయర్‌లకు కోచ్‌గా నియమించబడ్డాడు. ఈ క్రమంలోనే తన కూతురుకు కూడా క్రికెట్ పాఠాలు నేర్పాడు.
ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్‌ల నుంచి మలింగ రిటైరయ్యాడు. కానీ టీ20 ప్రపంచ కప్ లో ఆడడానికి రెడీగానే ఉన్నాడు. అయితే లంక టీ20 జట్టులో చోటు కోల్పోవడంతో 38 ఏళ్ల లసిత్ పొట్టి ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు అకాడమీతో కలిసి పనిచేస్తున్నాడు. యువ ఆస్ట్రేలియన్ బౌలర్లు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో సహాయపడటానికి. అతను ఆరు వారాల పాటు అకాడమీలో కోచింగ్ ఇస్తున్నాడు.
ఒకప్పుడు మలింగ అత్యుత్తమ యార్కర్లు ఆడిన సందర్భం ఉంది. అతని బౌలింగ్‌కు గొప్ప గొప్ప బ్యాట్స్‌మెన్ కూడా భయపడేవారు. తన 310 పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లలో, లసిత్ మొత్తం 445 వికెట్లు (వన్డేలు, టీ20Iలు రెండింటితో కలిపి) తీశాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్‌కు పదేళ్ల పాటు నాయకత్వం వహించాడు. ఐపీఎల్‌లో మలింగకు మంచి పేరుంది. అతను మొత్తం 110 ఐపీఎల్ గేమ్‌లలో 170 వికెట్లు పడగొట్టాడు. తాజాగా తన కూతురిని లంక తరుఫున అంతర్జాతీయ క్రికెట్ కోసం మెరుగులు దిద్దుతున్నాడు.