అనగనగనా ఒక దేత్తడి హారిక. యూట్యూబర్ గా ఆమె ఒక సంచలనం. యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె పెట్టే వీడియోలు.. పోస్టుల్ని వీక్షించే వారు పిచ్చ బోలెడు. యువతరానికి బాగా తెలిసిన హారిక.. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలియక పోవచ్చు. నిత్యం బిజీబిజీగా ఉండే ఆయన.. ఒక యువ యూట్యూబర్.. బిగ్ బాస్ ఫేం.. తెలంగాణ పిల్లగా తనకంటూ క్రేజ్ సంపాదించిన విషయాలు తెలియకపోవచ్చు. కానీ..తెలంగాణ సాధన కోసం తపించిన ఉద్యమకారుడిగా.. తెలంగాణ వారి ఐడెంటిటీ కోసం పోరాడిన వ్యక్తిగా తెలిసిన ఆయన.. చూస్తూ చూస్తూ ఒక తెలంగాణ ఆడబిడ్డను దారుణంగా అవమానించాల్సిన అవసరం ఏమిటి?
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక నియామకం ఆయనకు తెలీకుండా జరిగిందనే అనుకుందాం. అందులో శ్రీనివాస్ గుప్తా సొంతంగా నిర్ణయం తీసుకున్నారే అనుకుందాం. అందులో దేత్తడి హారిక తప్పేంటి? ఇప్పుడిప్పుడే తనకు తానుగా.. సొంత కాళ్ల మీద ఎదుగుతున్న ఒక మహిళా సెలబ్రిటీని ఉద్దేశించి అంత పరుషంగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? నిజమే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనివాస్ గౌడ్ లాంటి మంత్రితో తలపడే శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు. కానీ.. ఒక చిన్న అమ్మాయిని పట్టుకొని ఇంతలా ఇబ్బంది పెట్టటం ఏమిటి?
టూరిజం శాఖలో ఉన్న గ్రూపులకు.. గ్రూపు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని దేత్తడి హారిక లాంటి వారు అడ్డంగా బుక్ కావాల్సిందేనా? అవమానాలకు గురి కావాల్సిందేనా? నిజంగానే దేత్తడి హారిక నియామకం తప్పే అనుకుందాం. అంత మాత్రానా.. ఆమెను అవమానించేలా.. ఆమె ఎవరో తనకు తెలీదని.. ఒక మంచి సెలబ్రిటీని నియమిస్తామంటూ వ్యాఖ్యలు చేయటం ఏమిటి? ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే.. తెలంగాణ అమ్మాయికి జరిగిన అవమానమనే వాళ్లు. మరి.. సొంత రాష్ట్రంలో దేత్తడి హారికకు ఎదురైన చేదు అనుభవానికి బాధ్యులు ఎవరు?
ఒకవేళ దేత్తడి హారిక నియామకం నచ్చకుంటే.. మౌనంగా ఉండి.. కొద్ది రోజుల తర్వాత మరో సెలబ్రిటీని ఎంపిక చేస్తే సరిపోయేది. అంతేకానీ.. ఆమె ఎవరో తెలీదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉన్నానని.. పోలింగ్ అయ్యాక ఈ అంశం మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామనే పెద్ద మాటలు అవసరమా? ఇష్టం లేదు సరే.. అంత మాత్రాన తన మాటలతో అంతలా హర్ట్ చేయాల్సిన అవసరం మంత్రిగారికి ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరో తప్పులకు.. మరెవరి మధ్యనో ఉన్న అధిపత్య పోరుకు దేత్తడి హారిక అడ్డంగా బుక్ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.