అనుమానాలు నిజమవుతున్నాయి. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిపిన దాడి వెనుక భారీ స్కెచ్ ఉందా? అన్న సందేహానికి బలం చేకూరే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విపక్ష నేతపై దాడికి ఉపయోగించిన కోడి పందెం కత్తిని శ్రీనివాస్ ఎప్పుడు కొన్నారు? ఎక్కడ కొన్నారు? లాంటి వాటికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చేశాయి.
కోడి పందాలు లేవని.. అలాంటి వేళ పందెం కత్తి ఎందుకు? అంటూ కత్తులు తయారు చేసే వారికి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ప్రత్యేకమైన పని ఉందని. ఇంతకీ కత్తిని ఎప్పుడు కొనుగోలు చేశాడంటే.. నెల ముందే కొన్న వైనం తాజాగా బయటకు వచ్చింది. సుమారు నెల క్రితం ఊరికి వచ్చిన శ్రీనివాస్ కత్తులు తయారు చేసే వారి దగ్గరకు వెళ్లి.. కత్తిని తయారు చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని శ్రీనివాస్ గ్రామానికి చెందిన కోడి పందెం కత్తుల్ని తయారు చేసే వ్యక్తి చెబుతున్నారు. అంతేకాదు.. ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని శ్రీనివాస్.. నెల క్రితం తన సోదరుడి కుమార్తె పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరిపిన వైనాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.
పేద కుటుంబం.. పెద్దగా జీతాలు లేని శ్రీనివాస్.. సోదరుడి కుమార్తె పుట్టినరోజు పార్టీ నుంచి అంత గ్రాండ్ గా ఎలా చేశాడు? అందుకు అవసరమైన డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్నది అప్పట్లోనే ప్రశ్నలు వచ్చాయి. అయితే.. దీనికి సమాధానం అప్పట్లో లభించలేదు. తాజా పరిణామాలు చూస్తుంటే.. జగన్ మీద దాడి స్కెచ్ మొత్తం పక్కా ప్లాన్ అని.. అందులో భాగంగా శ్రీనివాస్ కు భారీగా డబ్బులు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు.