రేపిస్ట్ శ్రీనివాస్ రెడ్డి దారుణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముగ్గురు అమాయకపు బాలికలను హతమార్చి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం - భయం లేకుండా అతడు వారికోసం గాలించడం.. శవాలను వెలికితీస్తున్నప్పుడు ఏమీ తెలియని వాడిలా పోలీసులు - గ్రామస్థులకు సహాయం చేయడం చూసి ఇప్పుడు అంతా షాక్ అయ్యారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డినే అని పోలీసులు గుర్తించడంతో ఈ నరరూప రాక్షసుడు ఇన్నాల్లు తమలో ఒకడిగా ఉన్నాడా అని గ్రామస్థులంతా నివ్వెరపోయారు.
ఏప్రిల్ 25న పదోతరగతి విద్యార్థిని శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి. సీసీటీవీలో చిక్కి పోలీసులకు దొరికాడు. కానీ 2015లోనే 11 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన 11 ఏళ్ల బాలికను కూడా ఇదే శ్రీనివాస్ రెడ్డి బైక్ పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేసి హత్య చేసి పూడ్చిపెట్టాడు. ఆమె అమ్మమ్మ ఊరు హాజీపూర్ కు వస్తుండగా శ్రీనివాస్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అప్పుడు మిస్సింగ్ కేసు నమోదైనా.. పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈ దారుణాలు వెలుగుచూశాయి. అప్పుడే విచారణ చేసి ఉంటే మరో ఇద్దరి ప్రాణాలు దక్కి ఉండేవి.
25న పదోతరగతి విద్యార్థిని అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాస్ రెడ్డి బాలిక కోసం తల్లిదండ్రులు - గ్రామస్థులు చేసిన గాలింపులో కూడా భాగస్వామ్యం అవ్వడం గమనార్హం. వారి వెంట ఉండి బాలిక కోసం వెతుకుతున్నట్లు నటించాడు. చివరికి ఒక బావిలో స్కూల్ బ్యాగు ఆచూకీ దొరికినప్పుడు పక్కబావిలో మృతదేహం లభించినప్పుడు కూడా గ్రామస్థులు - పోలీసులకు సాయంగా ఉండి వాటిని వెలికితీశాడు. ఇలా అందరి మధ్యలో ఉండి.. తిరిగి అందరితో నిందితుడు ప్రవర్తించిన తీరును చూసి గ్రామస్థులు - పోలీసులే ఆశ్చర్యపోయారు.