ఎవరి నమ్మకాలు వారివి అని సింఫుల్ గా చెబుతారు. కానీ.. నమ్మకాలు లేకున్నా.. నమ్మకంగా చెప్పే మాటలు అందరిని భయపెడుతుంటారు. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. నిజమో.. అబద్ధమో కానీ.. వచ్చే ఏడాది జనవరి 27కు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు ప్రముఖ సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ. శాస్త్రీయ దృక్ఫదం లేనప్పటికీ.. కేవలం నమ్మకం ఆధారంగా ఆయనచెప్పే మాటల్ని పరిగణలోకి తీసుకుంటే వణుకు పుట్టటం ఖాయం. గతంలో ఆయన చెప్పిన మాటలు కొన్ని నిజమయ్యాయన్న ట్రాక్ రికార్డును చూపిస్తూ.. తాజాగా ఆయన చెప్పిన మాటలు అనవసరమైన బీపీని పెంచటంతో పాటు.. జనవరి27 వస్తోందంటేనే భయపడేలా చేస్తుందని చెప్పక తప్పదు.
ఇంతకీ.. జనవరి 27 ఏమిటి? ఆ డేట్ కి భయానికి లింకేమిటి? ఇంతకీ శ్రీనివాస గార్గేయ ఏం చెప్పారన్నది చూస్తే.. వచ్చే ఏడాది జనవరి 27న మౌని అమావాస్య అని.. అది సమస్యాత్మకమైనదని.. అందుకే ఆ రోజు అందరూ మౌనంగా ఉండాలని.. అస్సలు మాట్లాడకుండా ఉండటం ఉత్తమమని చెప్పుకొచ్చారు. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.
ఆయన చెప్పిన మాటలకు ఎలాంటి అన్వయం లేకుండా.. ఆయనేం చెప్పారో.. దాన్నే చెప్పాల్సి వస్తే..
= ఏటా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్యగా లేదంటే మౌని అమావాస్యగా వ్యవహరిస్తుంటారు.
= కానీ.. రానున్న జనవరి 27 వచ్చే అమావాస్య ఎప్పటిలా వచ్చేలా కాకుండా చాలా సమస్యలతో కూడింది
= ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మౌనంగా ఉండటం చాలా మంచిది.
= ఒకవేళ అంతసేపు మాట్లాడకుండా ఉండటం సాధ్యం కాదని అనుకునేవారు.. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా మౌనంగా ఉండాలి
= ఒకవేళ ఆ సమయంలో మాట్లాడితే.. గ్రహాల ప్రభావంతో తర్వాతి రోజు నుంచే ఇబ్బందులు తప్పవు.
= వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబరు 26న సహజ గమనంతో ధనస్సు రాశిలో ప్రవేశించాల్సి ఉంది. కానీ.. అతి గమనంతోహడావుడిగా జనవరి 26వ తేదీ రాత్రి 7-31 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశించనుంది.
=ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చిక రాశిలోకి జూన్ 21 నాటికి చేరుకుంటుంది.
= వృశ్చికరాశిలో కొంతకాలం పాటు ఉండి సహజ గమనంతో అక్టోబర్ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుంది.
= 2017 సంవత్సరం శుభప్రదమైనది కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నోట్ల కష్టాలు 2018 వరకూ ఉంటాయి. వచ్చే ఏడాది భూకంపాలు.. విమాన ప్రమాదాలు అధికంగా సంభవిస్తాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/