ఓబుళాపురం గనుల తవ్వకాలు - స్వల్పకాలంలో వేల కోట్ల ఆస్తితో తన ప్రత్యేకతను చాటుకున్న తెలుగు రాజకీయ - వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి మరోమారు తెరమీదకు వచ్చారు. సుదీర్ఘ కాలంగా మీడియాకు - వార్తలకు దూరంగా ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు వివాహం ద్వారా మరో గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో కూతురు నిశ్చితార్థాన్ని అట్టహాసంగా చేసిన గాలి...వివాహాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు భారతీయ సినీ దిగ్గజాలను రప్పించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వెలువడుతున్నాయి.
వచ్చే నవంబరులో జరగనున్న ఈ వివాహ సంబరాన్ని గ్రాండ్ గా చేయడంలో భాగంగా సినీ దిగ్గజాలు షారుక్ ఖాన్ - కత్రినా కైఫ్ - ప్రభుదేవాలతో ఆహుతులను అలరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. షారుక్ - కత్రినా ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా ప్రభుదేవా ఇంక ఓకే చెప్పాల్సి ఉంది. ఇక స్వతహాగా బీజేపీ నాయకుడిగా ఉన్న గాలి కూతురు వివాహానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. కాగా హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమారుడితో గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహం జరగనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్న గాలి ఓబులాపురం మైనింగ్ లో అవకతవకలకు పాల్పడి జైలు పాలయిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్ పొందేందుకు జడ్జీకి సొమ్ములు ముట్టచెప్పిన కేసులోనూ ఆయన చిక్కుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/