ఎవ‌రికైనా ఎస్టీ స‌ర్టిఫికెట్టే!

Update: 2022-02-11 05:52 GMT
వివిధ అవ‌స‌రాల కోసం ప్ర‌జ‌ల‌కు కుల ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికెట్ ఎంతో అవ‌స‌రం. దాని కోసం స‌చివాలయంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం.. అన్ని పరిశీలించాక అధికారులు దాన్ని జారీ చేయ‌డం సాధార‌ణ‌మే. కానీ ఏపీలో మాత్రం కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వాళ్ల‌లో దాదాపు అంద‌రికీ ఎస్టీ స‌ర్టిఫికేట్ జారీ అవుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీలోని గ్రామ స‌చివాల‌యాల్లో సాంకేతిక స‌మ‌స్య ఏర్ప‌డింది. సాఫ్ట్‌వేర్‌లోని త‌ప్పులే అందుకు కార‌ణం. ఏ సామాజిక వ‌ర్గం వారికైనా స‌ర్టిఫికెట్ జారీ అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాయి.

ప్ర‌కాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ ష‌బ్బీర్ కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం కోసం స్థానిక స‌చివాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు విచార‌ణ చేప‌ట్టి ఆయ‌న ద‌ర‌ఖాస్తును ఆమోదించారు. అయిదే ఆయ‌న షేక్ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడు అని పేర్కొంటూనే ఎస్టీ స‌ర్టిఫికెట్ జారీ కావ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాడు.

మ‌రోవైపు అదే ప్రాంతానికి చెందిన మాల సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప్ర‌తిమకు కూడా ఎస్టీ స‌ర్టిఫికెట్ జారీ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో గ‌త రెండు రోజులుగా కుల ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింద‌ని తెలిసింది. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నామ‌ని.. అది పూర్త‌య్యాక తిరిగి కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జారీ చేస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు.


    

Tags:    

Similar News