గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీ సీసీ ఫుటేజ్ చూస్తున్న సిబ్బంది

Update: 2021-03-27 10:01 GMT
తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. శుక్రవారం రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయంలోకి ఆగంతకుడు ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఉదయం సుప్రభాతం సేవ కోసం అర్చకులు ఆలయాన్ని తెరిచారు. అలయంలోని హుండీతో పాటు చిందరవందరగా పడి ఉన్న సామగ్రిని గుర్తించారు. చోరీ జరిగిందన్న అనుమానంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. గోవింద రాజ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న తిరుపతి అర్బన్ క్రైం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం ఏకాంత సేవ తర్వాత ఆలయంలోకి ఓ దొంగ వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. భక్తుడిలా బిల్డప్ ఇస్తూ లోపలికి వెళ్లాడు.. హుండీ దగ్గర డబ్బులు తీసేందుకు ప్రయత్నించాడు. భక్తులు అటువైపుగా రావడం చూసి అక్కడే నక్కాడు.. దేవుడికి నమస్కారం చేస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత మళ్లీ హుండీలో డబ్బు తీయబోయాడు. రెండు హుండీల్లో చోరీకి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. అన్ని తాళాలు వేయడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ కాగా, ఆ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఏకంగా గోవిందరాజు స్వామి ఆలయంలో చోరీ వ్యవహారం సంచలనంరేపింది.
Tags:    

Similar News