విశాల్‌ కు న్యాయం చేయాల‌న్న స్టాలిన్‌

Update: 2017-12-08 08:24 GMT
త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టిస్తున్న న‌టుడు విశాల్ నామినేష‌న్ వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. అమ్మ మ‌ర‌ణంతో అనివార్య‌మైన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణ కోసం రెండోసారి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌టం తెలిసిందే. ఈ ద‌ఫా న‌టుడు విశాల్ ఆర్కేన‌గ‌ర్ బ‌రిలో దిగి.. నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. ఆయ‌న నామినేష‌న్ కు మ‌ద్ద‌తుగా సంత‌కం చేసిన వారిలో ఇద్ద‌రు త‌మ సంత‌కాలు ఫోర్జ‌రీకి గురైన‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం.. త‌ర్వాత చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల‌తో విశాల్ నామినేష‌న్ ను రిజెక్ట్ చేసి.. ఆపై ఓకే చేసి.. మ‌ళ్లీ రిజెక్ట్ చేశారు,

ఈ అంశంపై ఓవైపు విశాల్ పోరాడుతుంటే.. మ‌రోవైపు ఆయన‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు డీఎంకే ముఖ్య‌నేత స్టాలిన్‌. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొళ‌త్తూరులో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా స్టాలిన్ నోట కీల‌క వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.

ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను జ‌ర‌గ‌కుండా చూసేందుకే అధికార అన్నాడీఎంకే అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఆర్కే న‌గ‌ర్ లో డీఎంకే సానుకూల ప‌వ‌నాలు వీస్తుండ‌టంతో తాము ఓడిపోతామ‌న్న ఉద్దేశంతోనే అధికార‌ప‌క్షం దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.

అధికార అన్నాడీఎంకే స‌ర్కారు ప‌ని తీరుతో రాష్ట్ర ప్ర‌జ‌లంతా తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌న్నారు. ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోతుంద‌న్నారు. విశాల్ ఎపిసోడ్ లో ఎన్నిక‌ల అధికారులు అధికార‌ప‌క్షానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంద‌న్నారు.

విశాల్ నామినేష‌న్ వివాదంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోకుంటే.. ఈ ఉప ఎన్నిక న్యాయంగా జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేద‌న్నారు. మ‌రి.. స్టాలిన్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో విశాల్ ఎపిసోడ్‌ పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News