ఐసీయూలో పిల్లుల పై హెచ్‌ ఆర్‌ సీ సీరియస్‌

Update: 2020-05-03 10:50 GMT
ఇండియాలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో వసతులను ఎక్కువగా ఎవరు కూడా ఊహించుకోరు. ప్రభుత్వ హాస్పిటల్స్‌ పరిశుభ్రత విషయంలో మరియు పట్టించుకునే విషయంలో చాలా అలసత్వంను కనబర్చుతూ ఉంటారు. రోగులను కింద పడుకోబెట్టి ట్రీట్‌ మెంట్‌ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇక హాస్పిటల్స్‌ లో ఎలుకలు.. పాములు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ ఉస్మానియా హాస్పిటల్‌ లో పిల్లులు స్వైర విహారం చేస్తున్నాయి.

ఎలుకల బెడద కారణంగా పిల్లులను చూసి చూడనట్లుగా హాస్పిటల్‌ వర్గాల వారు వదిలేశారట. దాంతో అవి ఇప్పుడు ఐసీయూలోకి కూడా చేరి నానా రచ్చ చేస్తున్నాయట. ఉస్మానియా హాస్పిటల్‌ లో పిల్లుల హంగామాపై ప్రముఖ లాయర్‌ రామచంద్రారెడ్డి మెయిల్‌ ద్వారా హ్యూమన్‌ రైట్స్‌ కు ఫిర్యాదు చేశారట. ఆయన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన హెచ్‌ ఆర్‌ సీ విచారణకు ఆదేశించింది.

రోగులకు పిల్లులు కొత్త రోగాలను తెస్తున్నాయట. రోగుల కోసం తీసుకు వచ్చిన పాలు ఇతర పదార్థాలను పిల్లులు తాగడం లేదా తినడం చేస్తున్నాయి. వాటినే రోగులు తినడం వల్ల లేని పోని కొత్త తరహా రోగాలు వస్తున్నట్లుగా ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే ఉస్మానియా హాస్పిటల్‌ ఉన్నతాధికారులు ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా హెచ్‌ ఆర్‌ సీ సీరియస్‌ అయ్యింది. రోగుల ఆరోగ్యం పట్ల ఎందుకు ఇంత అలసత్వం అంటూ సీరియస్‌ అయ్యింది.


Tags:    

Similar News