2 గంట‌ల టైం..మీకు న‌చ్చిన‌ప్పుడు కాల్చుకోండి

Update: 2018-10-31 05:50 GMT
దీపావ‌ళి అన్నంత‌నే గుర్తుకొచ్చేది ట‌పాసులు. అలాంటి ట‌పాసుల కాల్చ‌టంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆంక్ష‌లు పెట్ట‌టం తెలిసిందే. ఎక్కువ మోత‌.. పొగ ఎక్కువ‌గా వ‌చ్చే ట‌పాసుల్ని కాల్చే విష‌యంలో నియంత్ర‌ణ ఉండాల‌న్న మాట‌తో పాటు.. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే కాల్చాలంటూ ఆదేశాలు జారీ చేయ‌టం తెలిసిందే. దీనికి సంబంధించి దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయం వ్య‌క్తం కావ‌టం.

ప్ర‌తి అంశం మీద‌ సుప్రీంకోర్టు త‌మ జీవితాల్ని ఆదేశిస్తుందంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌టం.. దీపావ‌ళి ట‌పాసుల కాల్చుడు మీద సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల మాదిరి ప్ర‌క‌టించ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది.

మొద‌ట్లో పేర్కొన్న విధంగా దీపావ‌ళి రోజు రాత్రి 8 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌లో ట‌పాసులు కాల్చాల‌న్న మాట‌ను సుప్రీం చెప్పింది. అయితే.. దాన్ని స‌వ‌రిస్తూ.. దేశ ప్ర‌జ‌లు (ఢిల్లీ కాకుండా) దీపావ‌ళి రోజు త‌మ‌కు తోచిన‌ట్లుగా ట‌పాసులు కాల్చుకోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేసింది.

దేశంలో ప‌లు ప్రాంతాల్లో ప‌లు విధాలుగా ట‌పాసులు కాల్చే సంస్కృతి ఉన్నందున‌.. సుప్రీం తొలు చెప్పిన‌ట్లుగా కాకుండా కాల్చే విష‌యంలో టైం ప‌రిమితులు పెట్టొద్ద‌ని పేర్కొంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అప్పీలు దాఖ‌లు చేసింది. త‌మిళ‌నాడులో దీపావ‌ళి రోజున తెల్ల‌వారే వేళ‌లో ట‌పాసులు కాల్చే ఆన‌వాయితీ ఉంద‌ని పేర్కొంది.

అదే విధంగా దేశంలో ప‌లు ప్రాంతాల వారు వేర్వేరు స‌మ‌యాల్లో ట‌పాసులు కాలుస్తుంటార‌ని వెల్ల‌డించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధ‌ర్మాస‌నం ఏ స‌మ‌య‌మైనా స‌రే.. దేశ ప్ర‌జ‌లు ట‌పాసులు కాల్చుకోవ‌చ్చ‌ని కాకుండా రెండు గంట‌లు మాత్ర‌మే ట‌పాసుల‌కు టైం ఇస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.


Tags:    

Similar News