తప్పులకు శిక్ష వేయాల్సిందే. కాకుంటే.. అందుకు తగ్గట్లు ప్రజలకు అవగాహన కల్పించి.. మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత కఠినమైన చట్టాల్ని అమలు చేసినా ఎవరూ ఏమీ అనుకోరు. అందుకు భిన్నంగా శాసనకర్తలుగా మాకు తోచిన రూల్ తీసుకొస్తాం.. మీరు చచ్చినట్లు పాటించాల్సిందేనన్న అధికారిక హుంకరింపును ప్రజలు ఏ మాత్రం అంగీకరించరు.
ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టంలో.. నిబంధనల్ని బ్రేక్ చేసిన వాహనదారులపై భారీగా జరిమానాలు విధిస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ చట్టాన్ని అమలు చేయాల్సింది ఆయా రాష్ట్రాలే. ఈ కొత్త చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మాదిరి కొన్ని రాష్ట్రాలు మాత్రం అమలుపై తుది నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు.
కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న భారీ ఫైన్ లపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా పెంచిన ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాలపై తుది నిర్ణయం రాష్ట్రాలదేనని తేల్చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయటంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టంలోని జరిమానాల్ని సగానికి తగ్గిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మిగిలిన రాష్ట్రాలు సైతం ఫైన్లపై ఆయా రాష్ట్రాలదే తుది నిర్ణయంగా తేల్చేశారు. భారీ జరిమానాల చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలా? మార్పులు చేయాలా? అన్న విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోని సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి గడ్కరీ నోటి నుంచి వచ్చిన మాటల నేపథ్యంలో భారీ జరిమానాల్ని అమలు చేసే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు మరికాస్త ఆలస్యం చేసే అవకాశం ఉందంటున్నారు.